ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ యన అద్భుతమైన నటన, డిఫరెంట్ స్టై ల్, పవర్‌ఫుల్ ఎనర్జీ ఈ చిత్రాన్ని భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఐకానిక్ మూవీగా నిలిపింది. ఈ సినిమా కోసం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రాచుర్యం పొందింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’, మూవీలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఇం కా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. ‘ఊ అంటా వా..’ అనే పాట సెన్సేషన్ తర్వాత, సినిమాలోని ఇంట్రో సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ కూడా అంతర్జాతీయ ప్రేక్షకుల ను అబ్బురపరిచింది.
పాపులర్ అమెరికన్ టీవీ షో ‘అమెరికాస్ గాట్ టాలెంట్’లో బీ యూనిక్ క్రూ టీమ్ చేసిన అ సాధారణ ప్రదర్శనతో పుష్ప చిత్రానికి విదేశాల్లోనూ సరికొత్తగా ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ పాపులర్ డాన్స్ షోలో భారతీయ సంగీతంలోని శక్తిని, ఉత్సాహాన్ని ఇదివరకు ఎప్పుడూ చూడని వి ధంగా ప్రపంచం చూసింది. పాపులర్ డాన్స్ షో అమెరికా గాట్ టాలెంట్ లో భారతదేశానికి చెందిన డాన్స్ గ్రూప్ బీ యూనిక్ క్రూ.. పుష్ప చిత్రంలోని హిట్ సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్‌కు స్టేజ్‌పై అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చిం ది. పాటలోని అద్భుతమైన డాన్స్ మూ మెంట్స్ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచి మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ అద్భుతమైన ప్రదర్శన పుష్ప సినిమాలోని ఐకానిక్ స్టైల్‌కు, అల్లు అర్జున్ అద్భుత నటనకు ఘనమైన నివాళిగా నిలిచింది. ఈ డాన్స్ ప్రదర్శనను చూసిన ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో డాన్సర్స్‌ను అభినందించారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమా సంగీతం ఎంత ఆకట్టుకుందో, ఎంత ప్రభావాన్ని చూపించిందనే విషయాన్ని ఈ పాట మరోసారి రుజువు చేసింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమాన ఐకానిక్ స్టార్ హీరో పాట గ్లోబల్ స్థాయిలో ప్రాచుర్యం పొందినందుకు గర్వంతో, ఉత్సాహంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, సినిమా టీమ్ ఈ ప్రదర్శనను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఒక గ్లోబల్ ఫినామెనాన్. ఏజీటీ సీజన్ 20 స్టేజ్‌పై బీ యూనిక్ క్రూ పుష్ప పాటకు ప్రదర్శన ఇచ్చారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.
జడ్జిలు సైతం దీన్ని ది బెస్ట్ పర్ఫామెన్స్ ఆఫ్ ది సీజన్‌గా ప్రశంసించారు” అంటూ పోస్ట్ చేయటంతో ద్వారా అభిమానుల ఆనందం రెట్టింపయ్యింది. పుష్ప సినిమా, అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయంలో దీంతో మరోసారి నిరూపితమైంది. ‘వావ్ మైండ్ బ్లోయింగ్’ అని అల్లు అర్జున్ ఈ ట్వీట్‌ని కోట్ చేస్తూ స్పందించారు. భారతీయ సినిమా, సంగీతం ఎంత దూరం ప్రయాణించగలవో దీంతో తెలిసింది.