Sunday, May 19, 2024

దిగిరానున్న వంటనూనెల ధరలు

- Advertisement -
- Advertisement -

Declining cooking oil prices

ప్రామాణిక సుంకాలు తగ్గించిన కేంద్రం

హైదరాబాద్: దేశంలో పెరిగిన వంటనూనెల ధరలు తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటూ సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ రకాల వంట నూనెల దిగుమతిపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించింది. ముడి పామాయిల్‌పై ఉన్న 10శాతం సుంకాన్ని 2.5శాతానికి, ముడి సోయాబీన్ ఆయిల్ , ముడి సన్‌ప్లవర్ ఆయిల్‌పై ఉన్న 7.5శాతం సుంకాన్ని 2.5శాతానికి తగ్గించింది. దీంతో వంటనూనెల ధరలు దిగిరానున్నాయి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులకు ఇబ్బందిగా మారుతున్న పరిస్థితుల్లో వంటనూల ధరలు కూడా పెరిగిపోతూ మరింత మోయలేని భారంగా మారుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వంటనూనెల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకొంది. ప్రామాణిక సుంకలో 2.5శాతం తగ్గించింది. తగ్గింంచిన ఈ సుంకం ద్వారా వంటనూనెలు వినియోగించే వారికి మేలు చేకూరే విధంగా ప్రభుత్వం తనకు సుంకాల ద్వారా లభించే రాబడిలో రూ.4600కోట్లు వదులుకుంది.

అన్ని రకాల రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్ , పొద్దుతిరుగుడు వటనూనెలపైన ప్రామాణిక సుంకం 37.75శాతం నుంచి 32.5శాతానికి తగ్గించారు.తాజా తగ్గింపుతో వల్ల ముడినూనెలపై దిగుమతి సుంకం కలుపుకొని మొత్తం పన్నులు 24.75శాతానికి తగ్గనున్నాయి. ఇక రిఫైన్డ్ ఆయిల్స్‌పై పన్ను 35.75శాతానికి చేరనుననాయి. అయితే ముడి పామాయిల్‌కు సంబంధించి అగ్రిసెస్‌ను పెంచింది. కోవిడ్ కారణంగా ఆలస్యంగా దిగుమతి అయ్యే వంటనూనెల సరుకుల క్లియరెన్స్‌లను వేగవంతం చేయడానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కమిటిని ఏర్పాటు చేసింది. దిగుమతి చేసుకున్న వంటనూనెలను కమిటి వారానికి ఒకసారి సమీక్షించి వ్యవసాయవస్తువుల మంత్రివర్గ కమిటికి నివేదిక అందజేయనుందని అధికారులు వెల్లడించారు. ఈ నెలాఖురు నాటికి కొత్త ఖరీఫ్ పంట రాకతో ప్రపంచ మార్కెట్‌లో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.దేశీయంగా వంటనూనెల అవసరాల్లో 60శాతం విదేశాలనుంచే దిగుమతి అవుతున్నాయి. ఇండోనేషియా, మలేషియా, నుంచిఒ పామాయిల్ వస్తుండగా, అర్జెంటీనా, బ్రెజిల్ ,ఉక్రేయిన్ , రష్యా నుంచి సోయాబీన్ పొద్దుతిరుగుడు నూనెలు దిగుమతి అవుతున్నాయి. సంకాల తగ్గింపుతో కేంద్రం తీసుకున్న చర్యలతో వంటనూనెల ధరలు దిగివస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తాజాగా సుంకాన్ని తగ్గించడంతో ధరలు తగ్గనున్నాయని, మున్ముందు కూడా మరింతగా ధరలు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News