Tuesday, April 30, 2024

వృత్తి పట్ల అంకిత భావమే పోలీసు అధికారుల లక్షం

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: వృత్తి పట్ల అంకిత భావమే పోలీసు అధికారుల లక్షంగా ఉండాలని రామగుండం సిపి రెమా రాజేశ్వరీ అన్నానరు. వృత్తి పట్ల బాధ్యత, అంకిత భావం ఉన్నతాధికారుల పట్ల విధేయత కలిగి ఉన్న ఉద్యోగులు ఏ ప్రదేశంలో విధులు నిర్వహించిన సంతృప్తికరమైన జీవితం గడుపుతారని అన్నారు.

రామగుండం పోలీస్ కమీషనరేట్ నుంచి ఇతర కమీషనరేట్‌లకు, జిల్లాలకు బదిలీ అయిన జైపూర్ ఎసిపి గోపతి నరేందర్, గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్, స్పెషల్ బ్రాంచి ఎసిపి మోహన్, ఆర్ముడ్ రిజర్వు ఇన్‌స్పెక్టర్ మధూకర్, శ్రీధర్, అంజన్న, అనిల్, రాజేష్‌లకు పోలీస్ కమీషనరేట్ అధికారుల తరుపున ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని గోదావరిఖఖనిలోని ఇల్లందు క్లబ్‌లో ఆదివారం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి రెమా రాజేశ్వీర హాజరై అధికారులతో కలిసి బదిలీపై వెళ్తున్న పోలీసు అధికారులకు జ్ఞాపికలను అందజేసి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని, ఎప్పటికప్పుడు పరిస్థితులను అవగాహన చేసుకుంటూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారానే ప్రజల హృదయాల్లో అమూల్యమైన స్థానం పొందవచ్చని అన్నారు.

కాలానుగుణంగా ఎన్నో మార్పులు సమాజంలో వస్తున్నాయని, సమయాన్ని, సందర్భావన్ని బట్టి విధులు నిర్వర్తించాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల డిసిపి సుధీర్ కేకన్, పెద్దపల్లి ఎసిపి మహేష్, మంచిర్యాల ఎసిపి తిరుపతి, బెల్లంపల్లి ఎసిపి సదయ్య, స్పెషల్ బ్రాంచి ఎసిపి మోహన్, సిసిఎస్ ఎసిపిలు వెంకటేశ్వర్లు, ఉపేందర్, సిహెచ్.వెంకటేవ్వర్లు, ట్రాఫిక్ ఎసిపి బాలరాజ్, ఎఆర్ ఎసిపిలు సుందర్ రావు, మల్లికార్జున్, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News