Thursday, May 2, 2024

ఎన్‌టిఆర్ స్మారక నాణేనానికి భారీ డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాణాలలో రెం డు రకాలు ఉంటాయి. స్మారకం, మారకం. స్మా రకం అంటే జ్ఞాపకార్థం వేసే నాణాలు, మారకం అంటే ప్రజల్లో చెలామణీలో ఉండే నాణాలు. ఇటీవల ఎన్‌టిఆర్ ముఖ చిత్రంతో వేసినది స్మారక నాణా లు. కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్ట్రీ అజమాయిషీలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, మింట్ అని రెండు వర్గాలు ఉంటాయి. నాసిక్‌లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్స్‌లో రూపాయల నోట్లు, ప్రా మిసరీ నోట్లు, స్టాంపు పేపర్లు ముద్రిస్తారు. ముం బాయి, కోల్‌కత్తా, హైదరాబాద్‌లో ఉన్న మింట్ లో మారకం అయ్యే నాణాలు (రూపాయి బిళ్ళ లు) తయారుచేస్తారు. ఇవే గాక, మనం ఏ వ్యక్తి పే రు మీదైనా మాకు నాణాలు కావాలని ఏదైనా కు టుంబం నిర్ణీతమైన మొత్తాన్ని వారికి కడితే, వారు కోరినన్ని నాణాలను ముద్రించి ఇస్తారు. అయితే అవి ఎక్కువ మొత్త్గంలో ఉంటేనే అంగీకరిస్తారు. మొన్న విడుదలైన ఎన్‌టి రామారావు బొమ్మతో ఉన్న నాణెం అలాంటిదే! ఆయన కుమార్తె, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అలా అర్డరిచ్చి 14 వేల నాణాలను తయారు చేశారు.

ఆమె చెల్లించిన డ బ్బులతో వాటిని ముద్రించి, రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ నాణాలు కొని దాచుకోవటానికే తప్ప, మార్కెట్టులో చెల్లుబాటు అయ్యే నాణాలు కావు. మాజీ ముఖ్యమంత్రి, న టుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అభిమానులు సైఫాబాద్‌లోని ప్రభుత్వ మింట్ కాంపౌండ్‌కు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. వీరం తా ఎన్‌టిఆర్ రూ. 100 నాణెం కొనుగోలు చేయడానికి విచ్చేశారు. అగస్టు 28న నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్ ముఖంతో ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ముద్రించింది. హైదరాబాద్‌లోని మింట్‌లో ఈ నాణేలను ముద్రిస్తున్నారు. వంద రూపాయల వెండి నాణెం విడుదల చేయడంతో ప్రజలలో విశేషమైన ఆసక్తి కనబరిచారు. అగస్టు 29వ తేదీన తెల్లవారుజాము నుంచే ప్రజలు నిర్ణీత కేంద్రాల వద్ద లైన్లు ఏర్పాటు చేసి నాణేలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కొనుగోలు ఎంపికల ల భ్యత అమ్మకాల పెరుగుదలకు దారితీసింది. మొ దటి విడతలో 12వేలకు పైగా ఎన్టీఆర్ స్మారక నా ణేలు ముద్రించారు.మింట్ అధికారుల ప్రకారం, నాణేల తయారీలో నాలుగు లోహాల మిశ్రమాన్ని ఉపయోగించారు-. 50% వెండి, 40% రాగి, 5% నికెల్ 5% జింక్. ఈ నాణెం ధర రూ.100 అయినప్పటికీ, గిఫ్ట్ బాక్సులతో కూడిన వాస్తవ ధర రూ.4,050 నుంచి రూ. -4,850 విక్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News