Thursday, May 2, 2024

అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఉమ్మడి రాష్ట్రంలో అణచివేతకు గురైన తెలంగాణను అమరుల త్యాగఫలంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఏం కేసీఅర్ అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరులైన ముకుందాపురం గ్రామానికి చెందిన పిల్లి గిరిబాబుయాదవ్, చలకుర్తి గ్రామానికి చెందిన మైనంపాటి శ్రీనివాస్‌రెడ్డి తల్లితండ్రులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెలే నోముల భగత్ ఉదయం అల్పాహారం చేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద తల్లితండ్రులు, ఉద్యమకారులతో కలిసి నివాళులర్పించి, వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఅర్ సంబండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపాల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మశంకరయ్య, మార్కెట్ చైర్మన్‌లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, యడవల్లి మహేందర్‌రెడ్డి, సాదం సంపత్‌కుమార్, కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, నల్లగొండ సుధాకర్, మున్సిపాల్ కమీషనర్ వీరారెడ్డి, ఎంపీడీవో లక్ష్మి, కౌన్సిలర్లు వర్ర వెంకట్‌రెడ్డి, ప్రసాద్‌నాయక్, వెంకటయ్య, కోఅప్షన్ మెంబర్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, బీఅర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News