Thursday, May 2, 2024

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేయడమే ప్రభుత్వ ధ్యేయం అని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లి ంగయ్య అన్నారు. రామన్నపేట మండలంలోని నీర్మెముల గ్రామంలో రూ.50లక్షల అభివృద్ధి పనులకు,కొత్తగూడెం గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి , రూ.10లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజి నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామలు, అన్ని రంగాలలో అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తి వంచన లే కుండా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో గ్రామాలకు మహర్థశ వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాధరణకు, నిర్లక్షానికి గురైన అనేక గ్రామాలు బిఆర్‌ఎస్ పాలనలో క్రమక్రమంగా అభివృధ్ది చెందుతున్నాయని అన్నారు. అభివృధ్ది, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్చూగా మారిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి కన్నెబోయిన జ్యోతి బలరాం, వైస్ ఎంపిపి నా గటి ఉపేందర్,జెడ్పీటిసి పున్న లక్ష్మి,జగన్‌మోహన్, పిఏసిఎస్ చైర్మన్ నం ద్యాల భిక్షంరెడ్డి, మండల అధ్యక్షుడు ఉదయ్‌రెడ్డి, కార్యదర్శి పోషబోయి న మల్లేష్,మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్‌గౌడ్,సర్పంచులు గుత్తా నర్సింహారెడ్డి, ముత్యాల సుజాత, ఉప్పు ప్రకాష్, నాయకులు బత్తుల శంకరయ్య, మాజి వైస్ ఎంపిపి బద్దుల ఉమా రమేష్, ఆవుల నరేందర్, బత్తుల వెంకటేష్, ఎడ్ల సురేందర్‌రెడ్డి, గర్థస్ విక్రమ్, ఆవుల శ్రీధర్, నోముల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News