Friday, May 3, 2024

మౌళిక సదుపాయాలతో గ్రామాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి రూరల్: మౌళిక సదుపాయాల ఏర్పాటుతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మండలంలోని రాగినేడు గ్రామంలో సీడీపీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించే నూతన గౌడ సంఘం కమ్యూనిటీ భవనం, సీడీఎఫ్ నిధుల ద్వారా రూ.10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, పట్టణ అభివృద్ది కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. అంతర్గత రోడ్లతో సమీప గ్రామాలతో సంబంధాలు పెరుగుతాయని, దీంతో వ్యాపార, వాణిజ్యం నెలకొని అభివృద్ది జరుగుతుందన్నారు. కమ్యూనిటీ భవనాలతో ప్రజలంతా ఒక్కచోట చేరి వారి సమస్యలను చర్చించుకునే అవకాశం ఉంటుందన్నారు.

సబ్బండ వర్గాల అభివృద్ది లక్షంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసి అర్హులకు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ నిర్మల శ్రీనివాస్, కాల్వ శంకర్, పడాల తిరుపతి, పడాల జగన్నాథం, తోడేటి తిరుపతి, ముత్యం భూమయ్య, బుర్ర అంజయ్య, మధురయ్య, నర్సయ్య, రాయమల్లు, పరశురాం, రాములు, గౌడ కులస్తులు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News