Thursday, May 2, 2024

జువెలర్స్‌కు పండుగ కళ

- Advertisement -
- Advertisement -

Dhanteras 2021 Laxmi Puja

ధంతెరాస్ రోజు భారీగా బంగారం విక్రయాలు
కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పెరిగిన డిమాండ్

న్యూఢిల్లీ : గతేడాది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే తొలిసారిగా జువెలరీ షాప్‌లు కళకళలాడాయి. దీపావళి పండుగ సందర్భంగా బంగారం వంటి విలువైన లోహాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు చాలా ఆసక్తి చూపారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, సంప్రదాయంగా ‘ధంతెరాస్’ను ఒక శుభకరమైన రోజుగా భావించి, బంగారాన్ని కొంటారు. ఈసారి జువెలర్స్ డిస్కౌంట్లు, గిఫ్ట్‌లను ఆఫర్ చేయడంతో చాలా వరకు షాప్‌లు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యరాత్రి వరకు జువెలరీ షాప్‌లను తెరిచారు. భారతీయులు సాధారణంగా వివాహ వేడుకల సమయంలో బంగారం కొనుగోలు చేస్తారు. అలాగే దీపావళి వంటి వేడుకలకు నాణేలు, బార్స్ వంటి వాటిని ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొంటారు. ఇప్పటికీ గత రెండు సంవత్సరాలుగా చూస్తే అమ్మకాలు మందగించాయి.

కరోనా నిబంధనలు, ఆందోళనలతో బలహీన ఆర్థిక పరిస్థితులు, అధిక ధరలు వల్ల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉండడంతో జువెలర్స్ ఆరోగ్యకరమైన వృద్ధిని చూడనున్నారు. టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ ఆదాయంలో 77 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ జువెలరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ చావ్లా మాట్లాడుతూ, మొత్తానికి భారతీయులు ఖర్చుల విషయంలో చాలా సౌకర్యవంత స్థితికి చేరుకున్నారని, వివాహ సీజన్ డిమాండ్ పెరిగిందని అన్నారు. 2021 పండుగ సీజన్‌లో ఇతర జువెలరీ సంస్థలు కూడా మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ప్రభుత్వరంగ ఎంఎంటిసి, స్విస్‌కు చెందిన పిఎఎంపి ఎస్ జాయింట్ వెంచర్ ఎంఎంటిసిపిఎఎంపి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా సెప్టెంబర్ ఆఖరు నుంచి ఉత్పత్తులకు డిమాండ్‌ను చూస్తున్నాయి. ఈమేరకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News