Monday, April 29, 2024

యూనియన్ బ్యాంక్ లాభం మూడు రెట్లు పెరిగింది

- Advertisement -
- Advertisement -
Union Bank tripled its profits
క్యూ2 నికర లాభం రూ.1,526 కోట్లు

హైదరాబాద్ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రూ.1,526 కోట్లతో మూడు రెట్లు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.517 కోట్లుగా ఉంది. బ్యాంక్ నికర వడ్డీ ఆధాయం రూ.6,829 కోట్లతో 8.52 శాతం పెరిగింది. జూలైసెప్టెంబర్ కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.20,684 కోట్లకు పెరిగింది. గతేడాదిలో ఈ ఆదాయం రూ.20,182 కోట్లుగా ఉంది. బ్యాడ్ లోన్స్‌కు కేటాయింపులు రూ.4,242 కోట్ల నుంచి రూ.3,723 కోట్లకు తగ్గాయి. స్థూల ఎన్‌పిఎ (నిరర్థక ఆస్తులు) రూ.95,796 కోట్ల నుంచి రూ.80,211 కోట్లకు తగ్గాయి. నికర ఎన్‌పిఎ 4.13 శాతం నుంచి 4.61 శాతానికి స్వల్పంగా పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో యుబిఐ షేరు విలువ 2.70 శాతం పెరిగి రూ.49.35 శాతానికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News