Monday, May 20, 2024

శిథిలావస్థలో పోలీస్ క్వార్టర్స్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరో: ఆర్‌సి పురం పోలీస్ క్వార్టర్స్ ప్రమాదకరంగా మారాయి. చాలా ఏళ్ల క్రితం పోలీసు సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. రానున్న వర్షాలకు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇవి ప్రమాదకరంగా మారినా కూడా కొంతమంది పోలీసులు అందులోనే నివసిస్తున్నారు. ఇందులో ఉంటున్న పోలీస్ సిబ్బంది ప్రభుత్వం నుంచి హెచ్‌ఆర్ తీసుకుంటునే ఇక్కడే ఉంటున్నారు.

చాలామంది కానిస్టేబుల్స్ తమకు హౌస్ రెంట్ అలవెన్స్ రావడం, అద్దె చెల్లించడం తప్పడంతో ఇక్కడే ఉంటున్నారు. క్వార్టర్స్ కూలిపోయే స్థితికి వచ్చినా కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవడంలేదని తెలుస్తోంది. ఇప్పటికైన పోలీస్ అధికారులు వారితో క్వార్టర్స్‌లో నుంచి ఖాళీ చేయించాలని పలువురు కోరుతున్నారు. వర్షాలకు క్వార్టర్స్ కూలిపోతే పోలీసుల కుటుంబాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని వెంటనే వారిని ఖాళీ చేయించాలని పలువురు కోరుతున్నారు. వర్షాకాలంలో కాలం చెల్లిన భవనాలను కూల్చే పనులు చేస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు వీటిపై ఎందుకు దృష్టి పెట్టడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ క్వార్టర్స్‌లో హోంగార్డులు, కానిస్టేబుళ్లకు చెందిన దాదాపుగా 70 కుటుంబాలు ఉంటున్నట్లు తెలిసింది.హైదరాబాద్, సైబరాబాద్, సంఘారెడ్డిలో పనిచేస్తున్న పోలీసుల కుటుంబాలు ఇక్కడ ఉంటున్నట్లు తెలిసింది. క్వార్టర్స్‌లో చేరేందుకు సాధారణంగా వాటి పరిధిలోని ఎస్‌హెచ్‌ఓ అనుమతి తీసుకుని ఇందులో చేరాలి, కానీ ఇప్పుడు ఉంటున్న వారు ఎవరి అనుమతి తీసుకోకుండానే కుటుంబాలతో కలిసి వచ్చి ఇందులో ఉంటున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News