Friday, May 10, 2024

పాపిరెడ్డినగర్‌లో రక్తదాన శిబిరానికి విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రి కెటిఆర్‌ల ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కూకట్‌పల్లి డివిజన్‌లోని పాపిరెడ్డినగర్‌లోగల వీరాంజనేయ శివాల యం ప్రాంగణంలో బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చింత్‌ల్‌కు చెందిన ఆర్.ఎన్.సి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పం దన లభించింది. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, జగద్గిరిగుట్ట సిఐ క్రాంతికుమార్, కూకట్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలు ముఖ్య అతిధులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్న అభాగ్యులకు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సకాలంలో రక్తాన్ని అందించడం ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తదానం చేస్తేనే సాధ్యమని వారు తెలిపారు. ఎన్ని డబ్బులు పెట్టినా తయారు చేయలేనిది రక్తం మాత్రమేనని , 18 సంవత్సరాలు పైబడిన ఆరోగ్యవంతులందరూ డాక్టర్ల సలహామేరకు ప్రతీ ఏడు కనీసం రెండు నుంచి నాలుగు సార్లు రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు.

శిబిరంలో రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరిని, ఏర్పాటు చేసిన సంక్షేమ సంఘం నేతలను, ఆసుపత్రి సిబ్బందిని అభినందించిన వారు రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌రావు, బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎ.లక్ష్మీనారాయణ పాపిరెడ్డినగర్ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి, కోశాధికారి నర్సింహులు ముదిరాజ్ నేతలు పేర్ని ధర్మారావు, రామకృష్ణారెడ్డి, అనంత రాములు, డాక్టర్లు రమేష్, శేఖర్‌రెడ్డి, గోపి, పవన్, తిరుపతి, శ్రీనివాస్, హెచ్‌ఆర్ నవీన్, కిరణ్, గిరిధర్, శ్రీనివాస్, అనిత, సరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News