Tuesday, December 3, 2024

‘జపాన్’ యూనిక్ క్యారెక్టర్ బేస్డ్ మూవీ

- Advertisement -
- Advertisement -

హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ ‘దీపావళి’ కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజు మురుగన్ విలేకరుల సమావేశంలో జపాన్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.

జర్నలిస్ట్ గా, రచయిత పని చేసిన మీరు సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. మీరు సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు ?
నేను సినిమాల్లోకి రావడానికి చార్లీ చాప్లిన్ గొప్ప స్ఫూర్తి. నేను జర్నలిస్ట్ గా రచయితగా సోషల్ వర్కర్ గా పని చేశాను. చార్లీ చాప్లిన్ సినిమాలు చూసిన తర్వాత ఒక మూకీ చిత్రం ఇన్ని ఆలోచనలు, భావోద్వేగాలను రేకెత్తించినపుడు.. ఇప్పుడున్న సాంకేతికతను వాడుకొని సినిమా ద్వారా ప్రజలకు ఇంకా అద్భుతంగా కనెక్ట్ కావచ్చనిపించింది. ఆ స్ఫూర్తితోనే సినీ పరిశ్రమలోకి వచ్చాను.

చాలా తక్కువ సమయంలో ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు తెచుకున్నారు. మీ జోకర్ చిత్రానికి జాతీయ అవార్డు రావడం ఎలా అనిపించింది ?
అవార్డులు కోసం చిత్రాలు తీయాలనే ఆలోచన వుండదు. ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపే ముఖ్యం. అవార్డులని అదనపు బోనస్ గా భావిస్తాను. ప్రేక్షకుల ప్రేమ, అభిమానం, ఆప్యాయత నాకు చాలా ముఖ్యం. ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో ‘జోకర్’ చిత్రానికి అవార్డ్ తీసుకోవడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.

మీరు దర్శకుడు లింగుస్వామి వద్ద పని చేశారు కదా.. ఆయన నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
ఫిల్మ్ మేకింగ్ ని లింగుస్వామి గారి దగ్గర నేర్చుకున్నాను. లింగుస్వామి గారి చిత్రాలు యాక్షన్ జోనర్ లో ఉంటూనే మంచి పొయిటిక్ ఫీల్ తో వుంటాయి. ఆయన చిత్రాలన్నీ కమర్షియల్ గా ఉంటూనే క్లాస్ టచ్ తో వుంటాయి. పొయిటిక్ టచ్ తో కమర్షియల్ సినిమా ఎలా చేయాలో ఆయనుంచి నేర్చుకున్నాను.

‘జపాన్’ చాలా ప్రత్యేకమైన కథని టీజర్,  ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతోంది. ప్రమోషనల్ కంటెంట్ కి  ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. కార్తీ గారితో ‘జపాన్’ చిత్రం చేయాలనే ఆలోచన ఎలా మొదలైయింది ?  
నేను ఇంతకు ముందు చేసిన సినిమాల్లో పెద్ద హీరోలు లేరు. కార్తి మంచి స్నేహితుడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి. ఆయన్ను కలిసినప్పుడు హ్యుమర్ తో కూడిన మంచి కథ రాస్తే ప్రాజెక్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కథ చేయడానికి కార్తి గారే నన్ను మోటివేట్ చేశారు. కార్తి గారు లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసినప్పుడు సందేశం భారీస్థాయిలో ప్రేక్షకులకు చేరుతుంది.

జపాన్ క్యారెక్టర్‌ డ్రివెన్ ఫిల్మ్. కార్తీ సర్‌ని దృష్టిలో ఉంచుకుని రాశాను. నిర్మాతలు ప్రభు, ప్రకాష్ చాలా కాలంగా మంచి స్నేహితులు. నేను వారితో ‘జోకర్’ సినిమా చేశాను. జపాన్ కథ చెప్పినప్పుడు ఈ సినిమా చేస్తాం అన్నారు. బడ్జెట్‌ తో పాటు అన్ని విధాలుగా ఎంతో సపోర్ట్ చేశారు. కార్తి, నిర్మాతలు ప్రభు, ప్రకాష్ గారి సహకారంతోనే జపాన్ ఇంత గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘జపాన్’ ని ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. జపాన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అలరిస్తుంది.

కార్తీ గారు విలక్షణ నటుడు. తాను పోషించే పాత్రల్లో తనను తాను చక్కగా మలుచుకుంటారు. ఈ పాత్రని చేయడానికి ఆయన్ని ఎలా ఒప్పించారు ? కార్తి గారు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు ?    
కార్తి గారు సినిమా మేకింగ్ సమయంలో సలహాలు, కొన్ని ఆలోచనలు పంచుకున్నారు. ఆయన సపోర్ట్ తోనే ఈ సినిమా ఇంత పెద్దగా మారింది. కథ, కథనాల చెప్పినప్పుడు, సినిమా టేకింగ్ సమయంలో కార్తి గారు చాలా ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారో అని మనం కూడా ఆశ్చర్యపోతాం. అతని ప్రశ్నలు మనలో చాలా  కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. కార్తి గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.

జపాన్ ట్రైలర్‌లో విజువల్స్ అద్భుతంగా వున్నాయి డిఓపి రవి వర్మన్ సర్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
ఎస్. రవి వర్మన్ సర్ భారతదేశంలోని ప్రముఖ కెమెరామెన్‌లలో ఒకరు. అతను, కార్తీ సర్ చాలా బాగా సింక్ అయ్యారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. సినిమాకు ఆయన అందించిన సహకారం అద్భుతం. జపాన్ కథ చెప్పడానికి ఇంటర్నేషనల్ మేకింగ్ కావాలి. ఇందుకోసం రవి వర్మన్ గారిని తీసుకున్నాము. తన పనితీరుతో సినిమా క్వాలిటీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.

జపాన్ తారాగణం చాలా వెర్సటైల్ గా ఉంది. రవికుమార్ సార్, అను ఇమ్మానుయేల్, సునీల్‌ భిన్నమైన పాత్రలు కనిపిస్తునారు.. దిని గురించి చెప్పండి ?
స్క్రిప్ట్ డిమాండ్ ప్రకారమే నటీనటులని ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది. జపాన్ లో మంచి తారాగణం వుంది. సునీల్ సర్ పాత్ర చాలా ముఖ్యమైనది. సునీల్ గారు చాలా మంచి వ్యక్తి. ఆ పాత్రని అద్భుతంగా చేశారు. అలాగే అను ఇమాన్యువల్‌, రవికుమార్‌ సర్‌ మిగతా అందరూ చక్కని నటన కనబరిచారు.

జివి ప్రకాష్‌ గారి మ్యూజిక్ గురించి ?  .
జి వి ప్రకాష్ సంగీతం గొప్పగా వుంటుంది. మ్యూజిక్ కోసం చాలా కష్టపడ్డాడు. అతను టైట్ షెడ్యూల్ లో చాలా బిజీగా వున్నప్పటికీ ఎంతగానో సహకరించారు. అదే విధంగా, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్.. టెక్నికల్ టీం అంతా ఎంతగానో సపోర్ట్ చేశారు.

జపాన్ ట్రైలర్ చూస్తుంటే లోకేషన్స్ కోసం చాలా ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది.. ఎలాంటి లోకేషన్స్ లో చిత్రీకరించారు.
ఈ విషయంలో ముందుగా నిర్మాతలని అభినందించాలి. సినిమాకి కావాల్సిన ఫ్రీడమ్, మంచి బడ్జెట్‌ని ఇచ్చారు. ఎక్కడా రాజీపడలేదు. తూత్తుకుడి, కాశ్మీర్, కేరళ, చెన్నై, హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీ వంటి పలు లొకేషన్లలో సినిమాని చాలా గ్రాండ్ చిత్రీకరించాం. నిర్మాత ప్రభుగారు నాతో మరో సినిమా చేయాలని వుందని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మీరు పాటల రచయిత కూడా… లిరిక్స్ రాయడానికి మీ స్ఫూర్తి ఏమిటి? అలాగే “మోడరన్ లవ్ చెన్నై”వెబ్ సిరిస్ లో ఒక ఎపిసోడ్ డైరెక్టర్ చేశారు కదా..  దాని గురించి చెప్పండి ?  
బేసిగ్గా నేను రచయితని. గేయ రచయిత శ్రీ యుగ భారతి నాకు బ్రదర్ లాంటి వారు. నేను సినిమాల కోసం చెన్నైకి వచ్చిన తొలినాళ్ళలో అతని రూమ్ లోనే ఉన్నాను. నేను అతని నుండి స్ఫూర్తి పొందాను.
దర్శకుడు కుమారరాజ త్యాగరాజు “మోడరన్ లవ్ చెన్నై’ సిరిస్ కి నిర్మాత. తను నాకు  మంచి స్నేహితుడు. ఒక ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించమని నన్ను అడిగారు. ఇది లవ్ బేస్డ్ థీమ్ కావడంతో డైరెక్టర్ చేయడానికి  అంగీకరించాను. లవ్ స్టోరీలు, లవ్ థీమ్ సినిమాలను డైరెక్ట్ చేయడానికి నేను రెడీగా ఉంటాను.

మీ బలాలు ఏమిటి.. ఎలాంటి సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాలని భావిస్తున్నారు ?
పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను. ముందుగా మనకు నచ్చిన సినిమాలు తీస్తే, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతాను. నా సినిమాలన్నీ ప్యాషన్‌తో చేసినవే. జపాన్ మమ్మల్ని  నెక్స్ట్ లెవల్  తీసుకువెళుతుందని నమ్ముతున్నాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News