Monday, October 14, 2024

పేపర్ లీక్ నిందితులను ఉద్యోగాల నుండి తొలగింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పేపర్ లీక్ నిందితులు రేణుక, భర్త డాక్యా నాయక్‌లను అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. స్కూల్ ప్రిన్సిపల్ ఎస్‌సి గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్గ్ రోస్ కి నివేదిక పంపగా దీని ఆధారంగా రేణుకను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడిఓ కార్యాలయంలో ఉపాధి హామిలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రేణుక భర్త డాక్యా నాయక్ ను విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News