Thursday, May 2, 2024

జివో 76 ప్రకారం అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భూపాలపల్లి పర్యటనలో భాగంగా స్థానిక ఎంఎల్‌ఏగా భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ. 50కోట్లనిధులు మంజూరు చేయాలని కోరగా తక్షణమే రూ. 30కోట్లు విడుదల చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లి ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో సానుకూలంగా స్పందిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్, ఆయూష్ కాలేజ్,

మెడికల్ కాలేజ్ తరగతుల పనులకు వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో దీర్ఘకాలికంగా ఉండే సమస్యల పట్ల వీలైనంత త్వరలో పరిశీలిస్తామని, మంజూరైన రూ. 30కోట్ల నిధులతో భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గుర్తు చేశారు. ఇప్పటికే అంబేద్కర్ సెంటర్‌లో నాలుగు కోట్ల సిఎస్‌ఆర్ నిధులతో సుందరీకరణ పనులను ప్రారంభించుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. ఇటీవలే సింగరేణికి కేటాయించిన క్వార్టర్స్ పంపిణీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు సింగరేణి సంబంధించిన వ్యతిరేకవర్గం 400 క్వార్టర్లు వేరే వారికి అప్పజెప్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తి అవాస్తమవమన్నారు. డబుల్‌బెడ్రూం ఇండ్ల పంపిణీ విషయంలో మొదటి దశ ఇళ్ల పంపిణీ విజయవంతం జరిగిన క్రమంలో రెండవ దశ కూడా ఇళ్లుల యొక్క సుందరీకరణన పనులు జరుగుతున్న నేపథ్యంలో లబ్దిదారులకు కూడా పారదర్శకంగా ఎంపిక చేసి

త్వరగానే ఇళ్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం భూపాలపల్లి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా జడ్పి చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ. 30కోట్ల నిధులు కేటాయించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావుకు జిల్లా పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారి ఆర్థిక జీవనానికి బాసటగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 24గంటల నాణ్యమైన విద్యుత్ మే నెలలో కూడా నిండుకుండలతో చెరువులు, పేద మధ్య తరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేశారని అన్నారు.

100 పైచిలుకుగా ఉన్న గురుకులాలు నేడు ముఖ్యమంత్రి నాయకత్వంలో 1000 పైచిలుకుగా మారి సామాన్యుడి కొడుకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News