Thursday, May 2, 2024

బీఎండబ్ల్యూ కారు, బంగారం డిమాండ్.. పెళ్లికూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో 26 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కట్నం డిమాండ్లను తన కుటుంబం తీర్చలేదని ఆమె ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్జరీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న డాక్టర్ షహానా మృతిపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ప్రియుడిపై ఆత్మహత్యాయత్నం, వరకట్న నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అతడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. షహానా మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ విద్యార్థిని. ఆమె ప్రియుడు మెడికల్ పిజీ డాక్టర్స్ అసోసియేషన్ లో ప్రతినిధిగా విధులు నిర్వహిస్తున్నాడు. వారి వివాహనికి సదురు వ్యక్తి కుటుంబం బంగారం, భూమి బీఎండబ్ల్యూ కారు రూపంలో కట్నం డిమాండ్ చేసింది.

షహానా కుటుంబం  డిమాండ్లను నెరవేర్చలేక పోవడంతో మంగళవారం ఉదయం ఆమె తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. వివాహాన్ని నిలిపివేయడంతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని బంధువులు ఆరోపించారు. షహానా కుటుంబంలో ఆమె తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. అటు మంత్రి వీణా జార్జ్ ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సదురు వ్యక్తిని మెడికల్ పిజి డాక్టర్స్ అసోసియేషన్ బాధ్యతల నుంచి తప్పించినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News