Wednesday, September 24, 2025

డోలీ మోత…. ప్రభుత్వాలు మారిన గిరిజనుల రాత మారడం లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐటెక్ యుగంలోని అద్భుతమైన ఎఐ ప్రపంచంలో ఉన్నామని, ఆర్థిక గమనంలో దేశం ముందుకు వెళ్తుందని నాయకులు గొప్పలు చెబుతున్నారు. అభివృద్ధి అనేది పట్టణాలకు పరిమితమైందా?, గిరిజనులు జీవించే ప్రాంతాలలో సరైన రహదారులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. డోలీ మోత‌లు గిరిజ‌నుల‌కు త‌ప్ప‌డం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ‌న్యం జిల్లా కొమరాడ మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో గ‌ర్భిణీకి తీవ్ర అనారోగ్యాని గురికావడంతో డోలిమోతలో మోసుకుంటూ కుటుంబ స‌భ్యులు ఆసుపత్రికి తరలించారు. బంధువులు త‌మ‌కు డోలీ మోత క‌ష్టాలు తీర్చాల‌ని పాల‌కుల‌ను గిరిజ‌నులు వేడుకుంటున్నారు. స్వాతంత్ర్యం రాకముందు డోలీ మోతలు ఉన్నాయి, ఇప్పుడు డోలీ మోతలు ఉన్నాయని, ఎక్కడా అభివృద్ది జరిగిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పట్టణాల్లో జరిగే అభివృద్దే దేశాభివృద్ధా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా గిరిజన ప్రాంతాల్లో రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులే దేశాభివృద్ధికి సూచికలా? అని పాలకులకు చురకలంటిస్తున్నారు.

Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News