Thursday, May 2, 2024

సిపిఐ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయండి

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: సిపిఐ నేతలపై పెట్టిన అక్రమ కేసుల ను ఎత్తివేయాలని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, ఈటి నరసింహలు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు పాపాయిగూడలో భూదాన్ భూముల్లో గుడిసె లు వేసుకొని నివాసం ఉండే వారికి అండగా ఉన్న సిపిఐ నేతలపై అక్రమం గా పెట్టిన కేసులను ఎత్తివేయాలని బుధవారం తెలంగాణ రాష్ట్ర డిజిపి అం జన్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కుంట్లూరు సర్వేనం.215 నుండి 224 వరకు సుమారు 100 ఎకరాల భూదాన్ భూముల్లో 10 వేల మంది నిరుపేద కుటుంబాల ప్రజలు సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేశారని తెలిపారు.

పేదల పక్షన పోరాటం సాగిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పాలమకల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, రాష్ట్ర సమితి సభ్యులు ము త్యాల యాదిరెడ్డి, పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్‌రెడ్డి, సిపిఐ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నా యక్, జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి వేణుగోపాల్‌చారీలతో సహా 21 మంది సిపిఐ నేతల పై అక్రమ కేసులు నమోదు చేశారని డిజిపికి తెలిపారు.

భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తు పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలిపా రు. నకిలీ పత్రాలు సృష్టించి భూదాన్ భూములు కబ్జా చేసి అన్యాక్రంతం చే సే వారిపై తమ పోరాటం సాగిస్తున్నామని వివరించారు. భూదాన్ భూ ము లు కబ్జాకాకుండా సిపిఐ పేదలకు ఇంటి స్థలం దక్కెందుకు ఉద్యమం సాగిస్తున్నామని తెలిపారు. భూదాన్ భూముల పూర్వాపర్వాలు పరిశీలించి కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాలమక ల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, పానుగంటి పర్వతాలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News