Friday, May 3, 2024

నగరంలో మందుబాబుల ఆగడాలు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాల ను నడిపించి రోడ్డు ప్రమాదాలు చేస్తున్న వారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మద్యం తాగి కార్లను నడిపి అమాయకుల ప్రాణాలు తీస్తున్న సం ఘటన క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. గతంలో కూడా ఉప్పల్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు ఫుల్‌గా మద్యం తాగి కారును అతివేగంగా నడిపి ఇద్దరిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అలా గే ఓ కార్పొరేట్ కాలేజీ యజమాని కుమారుడు మద్యం తాగి 200 స్పీడ్‌తో కారు నడిపి మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తాజాగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 13లో బిఎండబ్లూ కారులో ముగ్గు రు యువకులు మద్యం తాగి అతివేగంగా కారు నపడం తో బైక్ వస్తున్న జిహెచ్‌ఎంసి సిర్కిల్ మేనేజర్ బాలచందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ కేసులో నిందితులు మ ద్యం తాగి కారును నడపడమే కాకుండా రాంగ్ రూట్‌లో వచ్చి వ్యక్తిని ఢీకొట్టారు. బాలచందర్‌కు తీవ్ర గాయాలు కావడంతో కారుతో పాటు పరారయ్యారు. అంతకు ము ందు నిందితులు మరో వ్యక్తిని ఢీ కొట్టే సమయంలో త ప్పించబోయి బాలచందర్‌ను ఢీ కొట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొద్ది రోజులు నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు ఎక్కువగా చేయకపోవడంతో మందుబాబులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నా రు. కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పో లీసులు నిత్యం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మందుబాబులు మద్యం తాగి వాహనాలు నడుపుతు ప ట్టుబడుతున్నారు. వారాంతం అయిందంటే చాలా యు వత ఎక్కువగా పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, గెస్ట్ హౌస్‌ల్లో అడ్డా వేసి మద్యంతో ఎంజాయ్ చేస్తున్నారు. త ర్వాత అర్ధరాత్రి రోడ్లపైకి వాహనాలతో వచ్చి హంగామా చేస్తున్నారు.

మద్యం తాగి వాహనాలను నడపడమే తప్పుకాగా, కార్లను వేగంగా నడుపుతున్నారు. దీంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ బడా కాంట్రాక్టర్ కుమారుడు ఫుల్‌గా మద్యం తాగి వేగంగా కారునడపడంతో రెయిన్‌బో ఆస్పత్రి ఎదుట రోడ్డు దాటుతున్న ము గ్గురు యువకులను ఢీకొట్టాడు. కూలీ పనిచేసుకునే ము గ్గురు యువకులు గాలిలో లేచి రోడ్డుపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మద్యం తాగిన తర్వాత వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎ క్కువగా బంజారాహిల్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు న మోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వారాంతంలో దాదాపుగా 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాం తాల్లో ఎక్కువగా పబ్బులు ఉండడం వాటిల్లో అర్ధరాత్రి వ రకు మద్యం తాగి రోడ్లపైకి రావడంతో కేసులు ఎక్కువ గా నమోదవుతున్నాయి.

వీటిని పరిశీలించిన పోలీసులు పబ్బులు ఎక్కువగా ఉన్న ప్రాంతం సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ సం ఖ్యలో మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారు ప ట్టుబడుతున్నారు. గత ఏడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిడి కేసులు 57,175 నమోదు కాగా, 979 మంది మందుబాబులను జైలుకు పంపించారు. మందుబాబులపై రూ.15,76,91,800 జరిమానా వి ధించగా, 32,238మంది లైసెన్స్‌లను రద్దు చేశారు.
యువతే ఎక్కువ… డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎక్కువగా యు వకులు పట్టుబడుతున్నారు. పబ్బులు, హోటళ్లు, బార్లలో యువతే ఎక్కువగా ఎంజాయ్ చేసేందుకు వెళ్తుండడంతో వారు పట్టుబడుతున్నారు. యువకులు మద్యం తాగిన త ర్వాత క్యాబ్‌లలో వెళ్లకుండా కార్లలో రోడ్లపైకి వచ్చి అతివేగంగా నడపడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

వీరి నిర్వాకం వల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన రో డ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం తాగి వాహనాలను న డపడం వల్లే ఎక్కువగా జరిగినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతకొంత కాలం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తక్కువగా చేస్తున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. దీని వల్లే చాలామంది మందుబాబులు మద్యం తాగి వాహనాలను నడుపుకుంటు రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రా ణాలు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. బడాబాబుల కుమారులు మద్యంతాగి వాహనాలను నడిపి ప్రమాదాలు చేస్తు న్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆ రోపణలు వస్తున్నాయి. సామాన్యులకు చుక్కలు చూ పిం చే పోలీసులు సంపన్నుల విషయంతో అలా వ్యవహరించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మద్యం తాగి వాహనాలను నడిపే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్య వహరించాలని హైదరాబాద్ వాసులు కోరుతున్నారు. న గరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత పెంచాలని, మందుబాబులపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నా రు. ముఖ్యంగా నగరంలోని సమయ పాలన పాటించకుండా మద్యం విక్రయించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News