Thursday, May 2, 2024

నేటి నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కింది స్థాయిలో గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని తెలిపింది.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాగల 24గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. గరిష్ట ,కనిష్ట ఉష్ణోగ్రతలు 31డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో నవంబర్ రెండు వరకూ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని , మూడవ తేది నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. తిరిగి ఆరు నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News