Tuesday, April 30, 2024

ఎన్నికల్లో ధన వర్షం… రోజుకు రూ.100 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ. 100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్ చేస్తున్నట్టు ఈసీ వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీల్లో ఇప్పటివరకు మొత్తం రూ. 4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. 2019తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. అంతే కాకుండా లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ తాయిలాలను సీజ్ చేయలేదని పేర్కొంది. ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News