Saturday, August 9, 2025

సాక్ష్యం చూపించండి లేదా సారీ చెప్పండి: రాహుల్‌కు ఇసి చురక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆరోపణల సాక్ష్యాల డిక్లరేషన్ సంతకంతో అందించండి.. లేదా తప్పుడు ఆరోపణలకు దిగినందుకు జాతికి క్షమాపణలు చెప్పండని రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ తమ వాదనను కొనసాగిస్తున్నారు. ఈ దశలో ఎన్నికల సంఘం వర్గాలు ఆయనకు సవాలు విసిరాయి. ఎన్నికల్లో ఓట్ల గోల్‌మాల్ జరిగిందని ఏ సాక్షాలతో చెపుతున్నారు? ఆధారాలు ఉంటే ఫిర్యాదును సంతకంతో తెలియచేయాలి. ఊరికే ఆరోపణలు చేస్తే ఇది దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం కిందికి వస్తుంది. దీనికి ఆయన క్షమాపణలు తెలియచేసుకోవల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తమ ఎదురుదాడిని తీవ్రతరం చేసింది. డిక్లరేషన్ లేదా క్షమాపణనా ఏదో ఒకటి తేల్చుకోండని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News