Thursday, May 2, 2024

నటి యామి గౌతమ్‌కు ఈడి సమన్లు

- Advertisement -
- Advertisement -
ED summons to actress Yami Gautam
ఫెమా కేసులో ఆమెపై అభియోగాలు

న్యూఢిల్లీ: విదేశీ మారకద్రవ్య చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో సినీ నటి యామి గౌతమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) శుక్రవారం సమన్లు జారీచేసింది. వచ్చే వారం ముంబయిలో తమ ఎదుట హాజరుకావాలని 32 ఏళ్ల యామి గౌతమ్‌ను ఆదేశించినట్లు ఈడి వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఆమెకు సమన్లు జారీచేయగా ఆమె హాజరుకాలేదని వర్గాలు తెలిపాయి. ఒక బ్యాంకు ఖాతాలో రూ. 1.5 కోట్ల డిపాజిట్‌కు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఆమెపైన కేసు నమోదైనట్లు వర్గాలు తెలిపాయి. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) కింద ఆమెపై దర్యాప్తు జరుగుతున్నట్లు వర్గాలు తెలిపాయి. తెలుగు, తమిళంతోపాటు అనేక హిందీ చిత్రాలలో యామి గౌతమ్ నటించింది. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్‌తో గత నెలలోనే ఆమెకు వివాహమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News