Monday, May 20, 2024

విద్యార్థుల తలరాతలు మార్చేది చదువు ఒక్కటే : మాధవరం

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాభోధన జరుగుతుందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో విద్యా దినోత్సవంలో భాగంగా ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్‌పేట్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే మాధవరం తన సోంతనిధులతో విద్యార్థులకు బ్యాగ్‌లు, పెన్నులు, వాటర్ బ్యాటిళ్లలతో కూడిన కిట్లను ఆయన విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహ్మయాదవ్‌తో కలిసి అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మన ఊరు, మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక నిధులను కేటాయించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని ఒక్కప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక వి ద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనంతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించటం ద్వారా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయమైన సంఖ్య పెరుగుతుందని హస్మత్‌పేట్ పాఠశాలలో 700మంది విద్యార్థులు ఉండటం అందుకు నిదర్శనం అని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ స్ఫూర్తితో తనవంతు నియోజకవర్గంలో గత సంవత్సరం 11 వేలమందికి బ్యాగులతో కూడిన కిట్లను అందజేశామని ఈ విద్యాసంవత్సరం సైతం నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కిట్లను అందజేస్తామని అన్నారు. అనంతరం నూతనంగా డిజిటల్ క్లాస్‌లను ప్రారంభించారు. విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్‌ఈఓ అంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లయ్య, బిఅర్‌ఎస్ నాయకులు కర్రెజంగయ్య, మక్కల నర్సింగ్‌రావు,గడ్డం నర్సింగ్‌రావు, స య్యద్ ఎజాజ్,డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, మేకల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News