Monday, February 17, 2025

మోగిన మండలి ఎన్నికల నగారా

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ,
ఒక పట్టభద్రుల స్థానానికి
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్, 27న
పోలింగ్, మార్చి 3న లెక్కింపు
కేంద్ర ఎన్నికల సంఘం
నోటిఫికేషన్ విడుదల నేటి
నుంచి ఎన్నికలు జరిగే జిల్లాల్లో
అమల్లోకి ఎన్నికల కోడ్

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ,
ఒక పట్టభద్రుల స్థానానికి ఏపిలో
రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ
స్థానానికి ఎన్నిక ఫిబ్రవరి 3న
నోటిఫికేషన్, 27న పోలింగ్, మార్చి
3న లెక్కింపు కేంద్ర ఎన్నికల
సంఘం నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి ఎన్నికలు జరిగే జిల్లాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో శాసనసమండలి ద్వైవార్షిక ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్రంలోని మూడు, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఉమ్మ డి మెదక్ -, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి, వరంగల్ , ఖమ్మం,- నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు గోదావరి పట్టభద్రుల, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఫిబ్రవరి పది వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా, ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు గడువు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఫిబ్రవరి 27న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఎన్నిక ప్రక్రియను మార్చి 8 వరకు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఏడు జిల్లాల్లో అమల్లోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి
తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికలకు కేం ద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రా ష్ట్రంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మ హబూబ్ నగర్ మినహా మిగిలిన ఏడు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మార్చి 3 వరకు అమల్లో ఉంటుంది. ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. మెదక్-, నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవీ కాలం, మెదక్, -నిజామాబాద్,- ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి పదవీ కాలం, వరంగల్,- ఖమ్మం,- నల్గొండ టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఈ మూడు స్థానాలకు కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

అమలవుతున్న పథకాలకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి
రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్నికల సంఘం అనుమ తి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే రైతు భరోసా వ ంటి పథకాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం వా టి వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా యి. ఇప్పటికే ప్రారంభమై అమల్లో ఉన్నందున వాటి కొనసాగింపునకు ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పకపోవచ్చునని,. అయినప్పటికీ సమగ్ర వివరాలతో ఎన్నికల సంఘానికి నివేదించి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అవుతుందని అధికార వర్గాల భోగట్టా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News