Friday, March 29, 2024

తెలంగాణ ఆవిర్భావంతో రైతుల జీవితాలలో వెలుగులు

- Advertisement -
- Advertisement -

పరిగి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాలు మారి పూర్తిగా అభివృద్ధి ్ద చెందాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శనివారం పరిగి మండల పరిధిలోని రంగాపూర్ రైతు వేదికలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మన తెలంగాణ.. దేశానికే అన్నపూర్ణ.. అనే నినాదంతో అన్నదాతలతో కలిసి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ఎమ్మెల్యే ర్యాలీగా నిర్వహించి పండుగ వాతావరణాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఎంపిపి కరణం అరవింద్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో రైతుల సంక్షేమ పథకాలను తీసుకవచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదే అన్నారు. రైతులు భాగుండాలని అనేక సంక్షేమ ఫథకాలను అమలు చేశారన్నారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా సౌకర్యం ప్రవేశ పెట్టి రైతులను రాజుగా చూడాలని కంకణ బద్దులయ్యారని గుర్తు చేశారు. క్లస్టర్ స్థాయిలో రైతులకు చేసిన మేలు, వచ్చిన పథకాలు లబ్ధిదారుల వివరాలను తెలిపారు. ధరణీ పోర్టర్ వచ్చిన తర్వాత రైతులకు మేలు జరిగిందన్నారు. ఏ రైతు ఆత్మహత్యలు చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో పంట పెట్టుబడి సహాయం ఎకరాకు ఏడాదికి రూ 10వేలు అందిస్తున్నామన్నారు. పండిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టు బాటు ధరలను కల్పించి కొనుగోలు చేస్తున్నామని గుర్తు చేశారు. రైతు బాగుంటేనే దేశం అన్ని విధాలుగా సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ తరుణ్‌కుమార్, ఎంపిపి కరణం అర వింద్‌రావు, ఎంపిడిఓ శేషగిరిశర్మ, ఏడిఏ సౌభాగ్యలక్ష్మీ, మండల ప్రత్యేకాధికారి దీపారెడ్డి, సోసైటీ సిఈఓ అమర్‌నాథ్‌రెడ్డి, అసిస్టేంట్ రిజిస్టార్ డి.వినయ్‌కుమార్, బ్యాంక్ మేనేజర్ బాలకృష్ణ, రంగాపూర్ సర్పంచ్ పెద్దలక్ష్మీ, విజయ్‌నాయక్, మాధారం సర్పంచ్ రాములు, నజిరాబాద్ సర్పంచ్ గణేష్‌నాయక్, పొల్కంపల్లి సర్పంచ్ మధుసూదర్‌రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, క్లస్టర్ ఏఈఓ, బిఆర్‌ఎస్ గ్రామ కమిటి అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News