- Advertisement -
ఛత్తీస్‌గఢ్‌లోని అభూజ్‌మడ్ (Abujmarh )అడవుల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో రూ.40 లక్షల చొప్పున రికార్డు ఉన్న ఇద్దరు తెలుగు మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా, మరో మావోయిస్టు కాదరి సత్యనారాయణ అలియాస్ కోస దాదా మృతి చెందినట్లు నారాయణపూర్ పోలీసులు తెలిపారు.
వీరిద్దరి స్వస్థలం కరీంనగర్ జిల్లా అని పోలీసులు వివరించారు. రామచంద్రారెడ్డి వయస్సు 63 సంవత్సరాలు కాగా.. సత్యనారాయణ రెడ్డి వయస్సు 67 సంవత్సరాలు. ఘటనా స్థలి నుంచి పోలీసులు ఒక ఎకె-47 తుపాకీ, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక గ్రనేడ్ లాంఛర్, మావోయిస్టు సాహిత్యం, ప్రచార సామాగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : సింగరేణి లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ : భట్టి
- Advertisement -