- Advertisement -
జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఇద్దరు భద్రతా సిబ్బందులకు తీవ్రంగా గాయాలయ్యాయి. బెహిబాగ్ ప్రాంతంలోని కద్దార్ లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం తెలియడంతో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాల అలజడి విని ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు సైనికుల అమరులయ్యారు. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
- Advertisement -