Monday, April 29, 2024

చేనేతకు ఇంజనీర్ల చేయూత

- Advertisement -
- Advertisement -

Engineers

 

‘పిక్ మై క్లాత్’ యాప్, వెబ్‌సైట్‌లో వీవర్స్ ప్రాడక్ట్
ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలకు ఆన్‌లైన్‌లో వేదికలు

హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఐదంకెల జీతంతో హాయిగా గడపాలని అందరూ అనుకుంటారు.. కానీ ఆ ముగ్గురు యువకులు అలా అనుకోలేదు… చేనేతకు చేయూతనిచ్చేందుకు పూనుకున్నారు. ఆన్‌లైన్‌లో చేనేతల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలని నిర్ణయించారు.. చేనేతలు సునిశిత నైపుణ్యంతో తయారుచేసే మగ్గం చీరలను ఎంతోమంది ఇష్టపడుతారు. నాణ్యమైన, పలు రంగుల్లో లభించే వస్త్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వస్త్రప్రియులు ఉత్సాహంగా చూపుతారు. అటువంటివారికి చేనేతచీరలు అందుబాటులో ఉంచేందుకు ఈ ముగ్గురు యువకులు ముందుకొచ్చారు. తమ విజ్ఞానాన్ని పదును పెట్టడం మొదలుపెట్టారు.. వెరసి సెల్లర్ యాప్, వెబ్‌సైట్, కస్టమర్ యాప్ రూపొందించారు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాదిరిగా చేనేత కళాకృతుల మార్కెటింగ్‌కు “పిక్ మై క్లాత్‌” పేరుతో వేదిక రూపొందించారు.

ముగ్గురు యువ ఇంజనీర్లు
రామ్ కల్యాణ్ మాలోతు, సూరం దినేష్, అభిషేక్ పసుపులేటిలు వరంగల్ ఎన్‌ఐటిలో ఇంజనీరింగ్ చదివారు. అభిషేక్ 2013లోనూ, కల్యాణ్, దినేష్‌లు 2014లోనూ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. చేనేత కార్మికులు నేసే వస్త్రా లు అమ్మకాల పరిధి తక్కువగానే ఉంటుందని గ్రహించిన ఈ ముగ్గురు వారి ఉత్పత్తుల అమ్మకాలు విస్తృతపరచాలని నిర్ణయించారు. ప్రపంచస్థాయిలో వీవర్స్ ప్రొడ క్ట్ మార్కెటింగ్ చేసేందుకు తలపెట్టారు. ఇందుకు యా ప్‌లు, వెబ్‌సైట్‌లు రూపొందించి వస్త్రప్రియుల దగ్గరకు చేర్చారు. చేనేతల ఉత్పత్తులు కూడా మంచి ధరకు అమ్మకాలు జరుగుతాయని ఆకాంక్షిస్తూ చేనేతలను క్రోడికరించారు.

గద్వాల్, కొత్తపల్లి, నారాయణపేట్, ధర్మవరం, పోచంపల్లి, ఉప్పాడ, కంచి, భాగల్‌పూర్, శాంతిపూర్, పైథాని, శ్రీకాళహస్తిలలో పర్యటించారు. ఆయా చేనేతల ఉత్పత్తుల ఫోటోలను ఈ ముగ్గరు యువ ఇంజనీర్లు ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చారు. వీటికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్, సెల్లార్ యాప్‌లు రూపొందించారు. “పిక్ మై క్లాత్‌” పేరుతో రూపొందించిన వెబ్‌సైట్, యాప్‌లలో చేనేతల ఉత్పత్తులను పొందుపరిచి అమ్మకాలు ప్రారంభించారు. సంవత్సరన్నర కాలంలో 1,750 అర్డర్లతో రూ.55 లక్షల ఉత్పత్తులు అమ్మకాలు జరిపారు.

సహకారం ఉంటే ఇంకా విస్తృతపరుస్తాం
రామ్ కల్యాణ్, దినేష్, అభిషేక్
చేనేతల నుంచి తయారయ్యే అద్భుతమైన వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే తపనతో ‘పిక్ మై క్లాత్’ రూపొందించాము. బంజారాహిల్స్ రోడ్ నెం:3లో మా సంస్థను సంవత్సరన్నర కాలంగా నడుపుతున్నాం. దీనిని స్థాపించకముందు రెండేళ్ల పాటు ఎంతో శ్రమించాం. పలు రాష్ట్రాలలోని వీవర్స్‌ను కలుసుకుని వారి ఉత్పత్తులను, వాటి ప్రత్యేకతలు తెలుసుకున్నాం. ఆయా ఉత్పత్తుల ఫొటోలు, లభ్యత, రేటు వివరాలు తెలియజేస్తూ ఆన్‌లైన్‌లో ఉంచాం. అందులో చూసి మెచ్చిన వస్త్రప్రియులు నేరుగా వారి నుంచే కొనుగోలు చేసే సౌకర్యం దీని ద్వారా రూపొందించాం.

దీని వల్ల అటు చేనేతలకు, ఇటు వినియోగదారులకు మేలు కలుగుతుంది. తాము నేసిన ఉత్పత్తులకు మెరుగైన ధర, కొనుగోలుదారులకు నాణ్యమైన ఉత్పత్తులు పొందుతారు. ఈ సేవలను మరింత విస్త్రృత పరిచేందుకు చూస్తున్నాం. ప్రొడక్ట్‌లకు బార్ కోడింగ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. దీంతో కొనుగోలుదారులకు మరింత స్పష్టత లభిస్తుంది తద్వారా అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. మాకు ఆర్థికంగా సహకారం అందితే మరింత ముందుకు సాగుతామనే నమ్మకంతో ఉన్నాం.చేనేతలకు పూర్తిస్థాయి మార్కెటింగ్ అందించడమే మా లక్షం.

Engineers help to weavers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News