Friday, March 29, 2024

రూ. 20లక్షలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Money

 

తనిఖీల్లో పట్టుబడుతున్న డబ్బు

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నిరంతర వాహన తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా పరిగణించే డబ్బు ప్రవాహాన్ని అరికట్టే దిశగా పోలీసులు కృషి చేస్తున్నారు. సిరిసిల్ల మునిసిపల్ పరిధిలో సోమవారం పోలీసులు తనిఖీలు చేపట్టి రూ.7.41 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కోసరావు పేట మండలంలో వైన్ నిర్వాహకులు సరైన ధ్రువపత్రాలు లేకుండా తమ వైన్స్ కలెక్షన్స్‌ను బ్యాంకులో డిడి తీసేందుకు సిరిసిల్లకు తరలిస్తుండగా రగుడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేసి నగదును స్వాధీనపర్చుకున్నారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో నగదు పట్టుకున్న ఘటన ఇదే మొదటిది కావడం గమనార్హం.

అదే విధంగా కుత్బుల్లాపూర్ మునిసిపల్ ఎన్నికలలో భాగంగా బౌరంపేట ఓఆర్‌ఆర్ వద్ద సోమవారం నిర్వహఙంచిన వాహనాల తనిఖీలలో రూ.11.87 లక్షల నగదు లభ్యమైంది. మెదక్ జిల్లా తుళ్లూరు నుంచి కుత్బుల్లాపూర్‌కు వస్తున్న సాంబశివరావు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.11.87 లక్షలు లభ్యమయ్యాయి. డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో దుండిగల్ మునిసిపల్ అధికారి మల్లారెడ్డి డబ్బును సీజ్ చేశారు. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ దృష్టా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకువెళ్లరాదని పోలీసులు పేర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో డబ్బు తీసుకెళ్లాలనుకుంటే అందుకు తగిన విధంగా డాక్యుమెంట్లు చూపాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు.

Rs 20 lakh seized
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News