Thursday, May 2, 2024

World Cup 2023: సెమీఫైనల్‌లో భారత్-పాక్ ఢీ?

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ సెమీ ఫైనల్లో ఇండియా-పాకిస్తాన్ ఢీకొంటాయా? ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫైనల్లో ఇండియా-పాక్ ఢీకొనే అవకాశం ఉందంటూ వాన్ ట్వీట్ చేయడంతో, అబిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

న్యూజీలాండ్ పై గెలిచి సెమీస్ అవకాశాలను పాకిస్థాన్ సజీవంగా ఉంచుకుంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా సెమీస్ కు చేరాయి. ఆప్ఘనిస్తాన్ పై గెలిచిన ఆస్ట్రేలియా కూడా పాయింట్ల పట్టికలో మూడో స్థానం సంపాదించి, సెమీస్ కు అర్హత సంపాదించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు, నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ లో ఆడాల్సి ఉంటుంది. అంటే, ఈ మూడింటిలో సెమీస్ కు చేరే జట్టుతో భారత్ తలపడుతుందన్నమాట.

ఇక రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ లో ఢీకొంటాయన్నది ఇప్పటికే ఖరారైంది. నాలుగో స్థానంలో సెమీస్ కు చేరి, ఇండియాను ఢీకొనే జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం న్యూజీలాండ్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఈ మూడు ఎనిమిదేసి పాయింట్లతో వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇవి తమ చివరి లీగ్ మ్యాచులు ఆడాల్సి  ఉంది.

న్యూజీలాండ్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ జట్లు సెమీస్ కు చేరే అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

న్యూజీలాండ్ నవంబర్ 9న తన చివరి లీగ్ పోటీలో శ్రీలంకను ఢీకొంటుంది. 10న సౌతాఫ్రికాతో ఆప్ఘనిస్తాన్, నవంబర్ 11న ఇంగ్లండ్ తో పాకిస్తాన్ తలపడతాయి.

లంకపై కివీస్, ఇంగ్లండ్ పై పాక్, సౌతాఫ్రికాపై ఆప్ఘన్ గెలిస్తే నెట్ రన్ రేటు కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం రన్ రేటుపరంగా న్యూజీలాండ్ మిగిలిన రెండు జట్లకంటే మెరుగ్గా ఉంది. కివీస్, పాకిస్తాన్ తమ ప్రత్యర్థులపై గెలిచినా కివీస్ రన్ రేటు మెరుగ్గా ఉంటే, పాకిస్తాన్ కు దారులు మూసుకుపోయినట్లే. శ్రీలంకపై న్యూజీలాండ్ భారీ విజయం సాధించకపోయినా, ఇంగ్లండ్ పై మాత్రం పాకిస్తాన్ గెలుపు మార్జిన్ చాలా బాగుండాలి. లేదంటే, అదృష్టం కివీస్ నే వరిస్తుంది. లంక చేతిలో న్యూజీలాండ్ ఓడిపోయి, ఇంగ్లండ్ పై పాక్ గెలిస్తే పాక్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. కానీ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆఫ్ఘనిస్తాన్ కూడా సౌతాఫ్రికాను భారీ మార్జిన్ తో ఓడిస్తే, అప్పుడు సమీకరణలు మారతాయి.

ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను కూడా కొట్టిపారేసేందుకు వీలు లేదు. కానీ అవి సంక్లిష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పటిష్ఠమైన సౌతాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి, కేవలం గెలిస్తే చాలదు… న్యూజీలాండ్, పాకిస్తాన్ తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోతేనే ఆప్ఘనిస్తాన్ సెమీస్ కు అర్హత సాధిస్తుంది. మరి, ఈ మూడింట్లో సెమీఫైనల్ లో టీమిండియాను ఏ జట్టు ఢీకొడుతుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News