Thursday, May 2, 2024

నేడు ఇంగ్లండ్‌తో పాక్ పోరు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా పాకిస్థాన్‌కు సెమీ ఫైనల్ అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలున్నాయి. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ తేడాతో గెలవడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారాయి. ఆ మ్యాచ్‌లో కివీస్ ఘన విజయం సాధించడంతో పాక్ నాకౌట్ ఆశలకు దాదాపు తెరపడిందనే చెప్పాలి.

ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ గెలిచినా సెమీస్ చేరుతుందా అంటే కష్టమేనని చెప్పాలి. పాక్ నాకౌట్ రేసుకు అర్హత సాధించాలంటే పలు సమీకరణాలు తారుమారు కావాల్సి ఉంది. ఇక కిందటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారీ తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ జోరుమీదుంది. వరుస ఓటములతో ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇలాంటి స్థితిలో పాక్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచినా ఓడినా ఇంగ్లండ్‌కు ఏలాంటి ప్రయోజనం లేదు. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని కాపాడుకుంటోంది.

అద్భుతమే జరగాలి..
ఇక పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరిగితే సాధ్యం కాదు. కివీస్ ఇప్పటికే మెరుగైన రన్‌రేట్‌తో దాదాపు సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అఫ్గాన్‌కు కూడా సెమీస్ అవకశాలు లేకుండా పోయాయి. పాకిస్థాన్ సాంకేతికంగానే సెమీస్ రేసులో నిలిచింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పాకిస్థాన్ సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే నిలకడగా రాణించడంలో మాత్రం పాక్ ఆటగాళ్లు విఫలమవుతున్నారు.

ఫకర్ జమాన్, అబ్దుల్లా షఫిక్, కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ రిజ్వాన్, సౌద్ షకిల్, ఇఫ్తికార్ అహ్మద్, ఆఘా సల్మాన్ తదితరులతో పాకిస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షహీన్ అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే బట్లర్, బెయిర్‌స్టో, స్టోక్స్, రూట్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ వంటి స్టార్ ఇంగ్లండ్ కూడా బాగానే ఉంది. అంతేగాక వోక్స్, మార్క్‌వుడ్, ఆదిల్ రషీద్ వంటి ప్రతిభావంతులైన బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News