విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. (Arjune chkravarthy) విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ వచ్చాయి. ఇటీవలే రిలీజైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ మేఘం వర్షించదా రిలీజ్ చేసి ‘అర్జున్ చక్రవర్తి’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు.
విఘ్నేష్ బాస్కరన్ బ్యుటీఫుల్ లవ్ సాంగ్‌గా కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన సాహిత్యం మనసుని హత్తుకునేలా(Heartwarming) వుంది. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ తమ మ్యాజికల్ వాయిస్‌తో కట్టిపడేశారు. ఈ సాంగ్ లో విజయరామరాజు, సిజా రోజ్ కెమిస్ట్రీ లవ్లీగా వుంది. అద్భుతమైన స్పోర్ట్ డ్రామాతో పాటు హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీతో అర్జున్ చక్రవర్తి అలరించబోతుందని ఈ సాంగ్ తెలియజేసింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.