Thursday, May 2, 2024

మేడిగడ్డకు ముప్పు లేదు

- Advertisement -
- Advertisement -

బ్యారేజీ కుంగుబాటుపై నిపుణుల పరిశీలన : ఈఎన్‌సి

మనతెలంగాణ/ హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లు స్పందించారు. ఈ బ్యారేజీ కుంగుబాటుపై నిపుణులు పరిశీలిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టును 2019లో ఎల్ అండ్ టీ నిర్మించిందని గుర్తు చేశారు. డిజైన్లో ఎలాంటి లోపం లేదని వివరించారు. ఈ బ్యారేజీ అడుగున్నర మేర కుంగుబాటు వచ్చిందని స్పష్టం చేశారు.

బ్యారేజీ కుంగుబాటు తర్వాత నీటిని దిగువకు విడుదల చేశామని ఇంజినీర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రాజెక్టును నిపుణుల విశ్లేషించి.. పరిశీలిస్తున్నారని అన్నారు. బ్యారేజీకి త్వరలోనే మరమ్మతులు చేపడతామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదు. బ్యారేజీ బి బ్లాక్ లో 20వ పిల్లర్ కుంగిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తాం. ఘటనపై మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని వెంకటేశ్వర్లు తెలిపారు.

గతంలో 29 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చినా బ్యారేజీ చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనిచేసిందని వివరించారు. రాష్ట్ర నీటి అవసరాల కోసం 2019 సంవత్సరంలో 86 పైర్‌లతో 1.632 కి.మీ పొడవైన లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ)ని ఎల్‌అండ్‌టి నిర్మించింది. అప్పటి నుంచి బ్యారేజీపై రాకపోకలు సాగుతుండటంతో పాటుగా పూర్తి స్థాయిలో ఉద్దేశించిన లక్ష్యాలను నెరవేరుస్తుంది. ఈ బ్యారేజీని 28.25 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జికి అనుగుణంగా డిజైన్ చేయడం జరిగింది. గతేడాది సామర్ధ్యం మించి అత్యధికంగా 28.70 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఇక్కడ నమోదైంది.

సాంకేతికంగా అంచనా వేసి నష్టాలను సరిదిద్దుతాం.. : ఎల్‌ అండ్ టి జనరల్ మేనేజర్ సురేష్‌ కుమార్
‘లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ)ని ఎల్‌అండ్‌టి నిర్మించిందని, గత ఐదు వరద సీజన్‌లను బ్యారేజీ తట్టుకుందని ఎల్ అండ్ టి జనరల్ మేనేజర్ సురేష్‌ కుమార్ వెల్లడించారు. శనివారం సాయంత్రం బ్యారేజీ బ్లాక్-7 లోని ఒక చోట పెద్ద శబ్ధం రావడంతో పాటుగా వంతెన భాగం కుంగిపోయింది. రాష్ట్ర అధికారులతో కలిసి మా సాంకేతిక నిపుణుల బృందం ఇప్పటికే ప్రాజెక్ట్ సైట్‌కు చేరుకోవడం తో పాటుగా ఈ నష్టానికి గల ఆకస్మిక కారణాన్ని అంచనా వేస్తోందని వెల్లడించారు. సాంకేతికంగా నష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఆ నష్టాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యను కంపెనీ తీసుకుంటుందని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News