భారత క్రికెటర్‌లో ఓ చరిత్ర ముగిసింది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితమే రోహిత్మ్ కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ స్థానిన్ని ఎవరితో భర్తీ చేయాలనే యోచనలో బిసిసిఐకి(BCCI) విరాట్ కూడా రిటైర్(Retirement) అవ్వడంతో ఇంగ్లండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో బిసిసిఐపై విరాట్ కోహ్లీ(Virat Kohli) అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ రిటైర్‌మెంట్ గురించి ‘టెస్ట్ క్రికెట్‌లో ఓ శకం ముగసిసింది.. కానీ, వారసత్వం కొనసాగుతుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. జట్టుకు ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిచిపోతాయి’ అంటూ బిసిసిఐ(BCCI) పేర్కొంది.
అయితే ఓ దిగ్గజ క్రికెటర్‌కు వీడ్కోలు పలికే పద్ధతి ఇదేనా? కోహ్లీతో పాటు రోహిత్‌ని కూడా బలవంతంగా రిటైర్ (Retirement) అయ్యేలా చేశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోచ్‌గా గౌతమ్ గంభీర్ చేసిన తప్పులను పట్టుంచుకోని బోర్డు.. ఆటగాళ్లపై ఇంత కఠినంగా వ్యవహరించిందని అంటున్నారు. విరాట్‌తో పాటు రోహిత్‌కి కూడా గౌరవప్రదమైన రిటైర్‌మెంట్ ఇస్తే బాగుండేది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.