Saturday, September 20, 2025

12 నెలల పసికందును నేలకేసి కొట్టిన తండ్రి

- Advertisement -
- Advertisement -

భార్యాభర్తల మధ్య విభేదాలు అభంశుభం తెలియని పన్నెండు నెలల చిన్నారిని బలితీసుకుంది. ఈ విషాద ఘటన శుక్రవారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌కు రెండేళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. సూర్యాపేట ప్రియాంక కాలనీలో వీరిద్దరూ నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి భార్యతో గొడవ పడుతుండగా వారి కుమార్తె చిన్నారి భవిజ్ఞ (12 నెలలు) భయంతో రోదించింది. దీంతో అసహనానికి గురైన వెంకటేష్ చిన్నారి కాళ్లు పట్టుకుని రెండుసార్లు నేలకేసి బాదాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని నాగమణి, స్థానికులు సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News