Friday, May 3, 2024

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియం త్రించా లనిజయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఈఓ కార్యాలయం ఛాంబర్ ముందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) ధర్నాను నిర్వహించారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రైవేట్ , కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యను వ్యాపారం చేసి విచ్చలవిడిగా లక్షల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద దోచుకుంటున్నారని అన్నారు. పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు అమ్ముతున్న విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం కూడా పట్టించు కోకపోవడం సిగ్గు చేటని అన్నారు.

అనుమతులు లేని పాఠశాలను సీజ్ చేయాలని, అనుభవజ్ఞులు లేని ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పిస్తూ విద్యా ర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఫిట్‌నెస్ లేని స్కూల్ వ్యాన్లను నడు పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

వెంటనే నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దయెత్తున ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఉద్రిక్తం చేస్తామని జోసెఫ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు మహమ్మద్ జుబేర్, కొమ్మెర రమేష్‌చారి, ఆముదాల వైష్ణవి, బొల్లి షుస్మిత, అనగాని రేష్మ, మురహరి సౌజన్య, చంద్రగిరి శ్యామ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News