Monday, May 13, 2024

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

fillm critics

 

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాల వారితో పాటు సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి ఆసరాగా నిలవాలన్న ఉద్దేశ్యంతో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 87 మంది సభ్యులకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.4.35 లక్షల ఆర్థిక సాయం చేసింది. ఈ మేరకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, కోశాధికారి ఎం.నాగభూషణం కలిసి రూ.4.35 లక్షల చెక్కులను ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ టి.సీతారాములుకి అందజేశారు.

అనంతరం 87 మంది సభ్యుల అకౌంట్‌లలోకి రూ.5 వేల చొప్పున ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. ఇక గత వారం కొంత మంది సభ్యులకు నిత్యావసర వస్తువులను కూడా అసోసియేషన్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ “ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 87 మంది సినీ పాత్రికేయులకు రూ.5 వేల చొప్పున అందజేశాం. ఇక సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి పనుల విషయంలో సినీ పాత్రికేయులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సినీ పెద్దలను కోరుతున్నాను”అని అన్నారు.

Financial assistance to 87 cine journalists
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News