Sunday, April 28, 2024

ఐటిపై కరోనా పిడుగు

- Advertisement -
- Advertisement -

 IT sector

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే ఇప్పటికే చిన్న సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్ పేరుతో షాక్ ఇచ్చాయి. ఇందులో ప్రముఖంగా ట్రావెల్ ఇండస్ట్రీపై ఆధారపడి సేవల గురించి వివరించే బిపిఒలు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. అమెరికా, యూకె, చైనా ఆధారిత కంపెనీల్లో పనిచేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు ఉంటాయో లేదో అనే భయం పట్టుకుంది. ఇప్పటికే ఈ ఏడాది కొత్త ప్రణాళికలు వేసుకున్న కంపెనీలు, ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు అప్పగిద్దామని భావించిన కంపెనీలు ఆ ప్రయత్నాలు విరమించుకున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఐటి రంగంలో 75 శాతం మంది వర్క్ ఎట్ హోంలో ఉన్నారు. తెలంగాణ నుండి ఐటి ఎగుమతుల్లో గత కొద్ది సంవత్సరాలుగా 17 శాతం వృద్ధి రేటు నమోదు చేయడంతో పాటు లక్షకోట్లను దాటింది.

ఐటి రంగంలో రాష్ట్రంలో 6 లక్షల వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని కంపెనీలు వీరి నుంచి దీర్ఘకాలపు సెలవు పత్రాలు తీసుకున్నాయి. చాలా కంపెనీలు రెండు నెలల ముందస్తు నోటీసులిచ్చి, రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఎటువంటి ప్రాజెక్టుల్లో లేని (బెంచ్ వర్కర్స్) వారి ఉద్యోగాలు దాదాపుగా ఊడినట్టేనని ఒక ఐటి ఉద్యోగి మన తెలంగాణకు చెప్పారు. ఒక ప్రముఖ కంపెనీ హెచ్‌ఆర్ కూడా ఉద్యోగుల నుంచి దీర్ఘకాలిక సెలవులు కోరుతున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం 85 శాతం వరకు పడిపోయింది. దీంతో కంపెనీలు సిఇఒల దగ్గర నుంచి ఉద్యోగులకు వరకు అందరి జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. దీనికి తోడు రాబోయే కొన్ని నెలల వరకు ఐటి రంగంలో కొత్త జాబ్స్ ఉండకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ఈ మధ్యే వ్యాపారంలోకి అడుగుపెట్టిన కంపెనీలు పే కట్స్ ప్రారంభించాయి. కొత్త ఉద్యోగాల భర్తీని ఆపేశాయి. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ (సిఐఐ) ఇండస్ట్రీ సైతం ఉద్యోగాల్లో భారీ కోత ఉంటుందని పేర్కొంది. ఇటీవల 200 సంస్థల సిఇఒలతో సిఐఐ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. లాక్‌డౌన్ పూర్తయ్యాక ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని 52 శాతం మంది సిఇఒలు చెప్పగా, తక్కువలో తక్కువగా 15 శాతం ఉద్యోగాల్లో కోత ఉంటుందని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. 15 నుంచి 30 శాతం ఉద్యోగాలు పోతాయని 30 శాతం మంది అంచనా వేశారు. ఆదాయంలో 10 శాతానికి పైగా లాభాల్లో 5 శాతం క్షీణత ఉంటుందని పలు సంస్థలు తెలిపినట్లు సర్వేలో పేర్కొన్నారు.

దేశంలో లక్షన్నర ఐటి ఉద్యోగులు ఔట్ !
మన దేశంలోనే మూడు, ఆరు నెలల్లోనే లక్షన్నర జాబ్‌లు పోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న, చిన్న కంపెనీలు మనుగడ సాధించవలేవని, ఫలితంగా వాటిలో పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోక తప్పదని పేర్కొంటున్నారు. భారత ఐటి రంగంలో దాదాపు 50 లక్షల మంది వరకు పనిచేస్తున్నారు. చిన్న ఐటి కంపెనీల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. దేశంలో టాప్ 5లో ఉన్న ఐటి కంపెనీలో దాదాపు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. వచ్చే త్రైమాసికంలో ఫలితాలు, రాబడులు దారుణంగా ఉండవచ్చునని హెచ్చరించాయి. లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. లక్షన్నర ఐటి ఉద్యోగులు జాబ్స్ పోతాయనేది ప్రాథమిక అంచనా మాత్రమేనని అంతా కుదురుకున్న తరువాత చూస్తే ప్రతికూల ప్రభావం ఎక్కువ ఉంటుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Corona impact on IT sector
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News