Monday, April 29, 2024

మాజీ ఎంపి కవిత సహాయంతో పునర్జన్మ ఎత్తిన ఆర్తి

- Advertisement -
- Advertisement -

MP Kavitha

 

మనతెలంగాణ/హైదరాబాద్: కోమాలోకి వెళ్లిన ఓ బాలింతకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత పునర్జన్మ కల్పించారు. నిజమాబాద్ పట్టణానికి చెందిన అర్తి ప్రసవం అనంతరం పిట్స్‌వచ్చి క్రమేనా కోమాలోకి జారుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కవిత ఆర్తి కుటుంబసభ్యులతో మాట్లాడి హైదరాబాద్‌లో ఆధునిక వైద్యం ఇప్పించారు. ప్రస్తుతం ఆర్తి కోమా నుంచి కోల్కొని కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సంఘటన వివరాల్లోకి వెళ్లితే వారం రోజుల క్రితం అర్తి నిజమాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించి పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఒకపాప, ఒకబాబు కవలలుగా జన్మించారు. డెలివరీ అనంతరం మూడురోజులకు ఆసుపత్రి నుంచి ఆర్తి తన సొంత ఇంటికి చేరుకున్నారు. పండంటి కవలలకు జన్మనిచ్చిన ఆనందం తీరకముందే ఆమెకు ఫిట్స్‌వచ్చాయి.

ఫిట్స్‌తో పాటు నెమ్మదిగా మెదడులో రక్తం గడ ్డకట్టడంతో అర్తి కోమాలోకి జారుకుంది. అయితే నిజమాబాద్‌లో అత్యాధునిక వైద్యం అందుబాటులో లేకపోవడంతో పాటు పేద కుటుంబానికి చెందిన ఆర్తి బంధువులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తమ బాధను ట్విట్టర్ వేదికగా కవితకు విన్నవించారు. తక్షణం స్పందించిన కవిత నిజమాబాద్‌లోని టిఆర్‌ఎస్ కార్యకర్తల సహాయంతో ఆర్తిని ప్రత్యేక ఆంబులెన్స్‌లో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈనెల 9వ తేదీ అర్థరాత్రి నుంచి కిమ్స్‌లో ఆధునిక వైద్యసేలను అందించారు.

ఎప్పటికప్పుడు కవిత డాక్టర్లతో మాట్లాడుతూ చికిత్సకు సహాయం అందించారు. ఆధునిక వైద్యసేవలు అందిన ఆర్తి సోమవారం ఉదయం కళ్ళుతెరిచి సాధారణ స్థితిలోకి వచ్చింది. తల్లిబిడ్డలు ఆసుపత్రి నుంచి సాయంత్రం ప్రత్యేక ఆంబులెన్స్‌లో నిజమాబాద్ చేరుకున్నారు. తల్లి అర్తితో పాటు కవలపిల్లలు ప్రస్తుతం క్షేమంగా ఉండటంతో మాజీ ఎంపి కవిత ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఎలాంటి వైద్య సహాయం అవసరమున్నా చెప్పాలని కవిత వారికి మరింత ధైర్యం చెప్పారు.

కవితక్క రుణం తీర్చుకోలేనిది
కోమా నుంచి బయటకు వచ్చిన అర్తి కవిత సహాయం చేశారని తెలుసుకుని ఎంతో ఆనందించారు. కవితది గొప్పమనసని అర్తి కుటుంబసభ్యులు ధన్యవాదాలు చెప్పారు. కవితక్క చేసిన సహాయంతోనే తాను పునర్జన్మ ఎత్తి తన పిల్లలను చూసుకోగలిగానని అర్తి కృతజ్ఞతలు చెప్పారు.

 

Former MP Kavitha helped to Postpartum women
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News