Tuesday, April 23, 2024

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్.. నిబంధనలు పాటించకుంటే జరిమానా

- Advertisement -
- Advertisement -

Fines

 

హైదరాబాద్ : బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రమాదాలు జరగకుండా జిహెచ్‌ఎంసి, ఎస్‌ఆర్‌డిపి చర్యలు తీసుకుందని, ఫ్లైఓవర్ లెవల్ 2 ఓపెన్ చేశామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు నిబంధనల మేరకు 40 స్పీడ్‌లో మాత్రమే వెళ్లాలని కోరారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ ఫోలీసులు తెలిపారు.

సూచనలు…
వాహనదారులు 40 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్లకూడదు.
ఎడమవైపు ఉన్న లేన్‌లో మోటార్ సైకిళ్లు వెళ్లాలి, ఎవరికి కేటాయించిన లేన్‌లో వారే వెళ్లాలి.
ఫ్లైఓవర్‌పై సెల్ఫీలు తీసుకోవడం, మధ్యలో ఆగడం నిషేధం.
ఫ్లైఓవర్‌పై నుంచి నడిచి వెళ్లకూడదు.
ఆపోజిట్ డైరెక్షన్‌లో వాహనాలను నడుపవద్దు.
ముందు వెళ్తున్న వాహనానికి నిర్ణీత దూరం పాటించాలి.
భారీ వాహనాలను ఫ్లైఓవర్‌పై నిషేధించారు. భారీ వాహనాలు కింది నుంచి వెళ్లాలి.

పోలీసుల చర్యలు…
ఓవర్ స్పీడ్ వెళ్తున్న వాహనాలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేశారు. అత్యధిక వేగంగా వెళ్తున్న వాహనాలను గుర్తించి భారీ జరిమానా విధించనున్నారు.
హెల్మెట్ డిటెక్షన్ సిస్టం ద్వారా హెల్మెట్ లేకుండా వెళ్తున్న మోటార్ సికిల్ దారులకు జరిమానా విధించనున్నారు.
సిసి టివిల ద్వారా లేన్ డిసిప్లిన్ పాటించని వారిని గుర్తించి జరిమానా విధించనున్నారు. టూవీలర్లు రైట్ లైన్‌లో, మిగతా వాహనాలు లెఫ్ట్ లేన్‌లో వెళ్లాలి.
ఫ్లైఓవర్‌పైకి భారీ వాహనాలు వస్తే జరిమానా విధించనున్నారు.
ఫ్లైఓవర్‌పై ఆగినా, నిలబడినా, నడుచుకుంటూ వెళ్తున్నా వెంటనే ట్రాఫిక్ పోలీసులు మైక్‌లో హెచ్చరిస్తారు.

Fines for not following Regulations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News