Thursday, May 2, 2024

38 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire broke out in 38-story building in Hong kong

రూఫ్‌టాప్‌పై చిక్కుకున్న 300 మంది

హాంగ్‌కాంగ్ : హాంగ్‌కాంగ్ లోని 38 అంతస్తుల భవనంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. కాజ్‌వే షాపింగ్ జిల్లాలో ఉన్న గ్లౌసెస్టర్ రోడ్డు లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు భవనం రూఫ్‌టాప్‌పై దాదాపు 300 మంది చిక్కుకుని ఉంటారని సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు చెప్పింది. ఈ భారీ భవనంలో ఆఫీసులు, మాల్ ఉన్నాయి. కొంతమందిని సహాయ సిబ్బంది రక్షించగలిగారు. 12 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. షాపింగ్ మాల్ మొదటి అంతస్తులోని ఎలెక్ట్రికల్ స్విచ్ రూమ్‌లో మొదట మంటలు ఆరంభమయ్యాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ భవనం నుంచి 1200 మందిని ఖాళీ చేయించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు ప్రమాదం జరిగిందని, మధ్యాహ్నం 3 గంటలకు మంటలు అదుపు లోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News