Saturday, April 27, 2024

అడవుల్లో వరుస అగ్నిప్రమాదాలు…

- Advertisement -
- Advertisement -

పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామని కొండా సురేఖ ఆందోళన
బీడీ , సిగరేట్ చుట్ట తాగి అడవుల్లో పడేయవద్దని హితవు

మన తెలంగాణ / హైదరాబాద్ : వేసవి మొదలైనప్పటి నుంచి అడవుల్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖను ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఈ మధ్యకాలంలో అమ్రాబాద్, కవ్వాల్, తాడ్వాయి, ఇల్లందు తదితర ప్రాంతాల్లో అటవీ ప్రమాదాలు జరుగుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ అటవీ ప్రమాదాల వల్ల వన్య ప్రాణులతో పాటు విలువైన అటవీ సంపదకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉన్నందున అటవీశాఖ తో పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సురేఖ సూచించారు.

అగ్ని ప్రమాదాల వల్ల పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల గుండా ప్రయాణం చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని.. వేసవిలో అడవుల్లో వంట చేయడం, సిగరెట్, బీడీ, చుట్ట లాంటివి తాగి అక్కడ అడవుల్లో పడేయడం చేయవద్దని మంత్రి కోరారు. ఇలా మానవ నిర్లక్ష్యం వల్లే అటవీ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందువల్ల తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదే సమయంలో అటవీ శాఖ వద్ద ఉన్న అటవీ అగ్ని ప్రమాద నివారణ యంత్రాలపై మంత్రి అధికారులతో ఆరా తీశారు.

ప్రస్తుతం అటవీ అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎలా ఉంది, వీలైనంతగా ప్రమాదాలను అరికట్టడానికి మరింతగా ఏం చేయాలన్న ప్రతిపాదనలపై మంత్రి ఫోన్ ద్వారా అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంల అధికారులు పిసిసిఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి అగ్ని ప్రమాదాల రిపోర్టు అందగానే క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను అప్రమత్తం చేసి వీలైనంత త్వరగా అగ్ని ప్రమాద ప్రాంతాలకు చేరి అగ్గిని నివారించే చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం స్థానికుల సహకారం కూడా కోరాలని మంత్రి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News