Tuesday, April 30, 2024

మతమార్పిడి నిషేధ చట్టం బోణీ

- Advertisement -
- Advertisement -

first case registered under Prohibition of Religious Conversion Act

 

యుపిలో అహ్మద్‌పై తొలికేసు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో తీసుకువచ్చిన మత మార్పిడి నిషేధ చట్టం పరిధిలో ఒక్కరోజు వ్యవధిలోనే ఈ చట్టం పరిధిలో తొలికేసు నమోదు అయింది. ఓ యువతి తండ్రి చేసిన ఫిర్యాదు ప్రాతిపదికన బరేలీ జిల్లాలోని దేవార్నియాన్ పోలీసు స్టేషన్‌లో ఈ కేసును ఓ యువకుడిపై నమోదు చేశారు. మతం మార్చుకోవాలని ఓ మహిళపై ఉవైష్ అహ్మద్ అనే వ్యక్తి ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఇప్పుడు తీసుకువచ్చిన చట్టం పరిధిలో కేసు నమోదు చేసినట్లు, నిందితుడు పరారీలో ఉన్నట్లు బరేలీ పోలీసులు ఆదివారం తెలిపారు. లవ్ జిహాద్ పేరిట బలవంతపు మత మార్పిళ్లకు దిగుతున్నారని పేర్కొంటూ దీనిని నిషేధించేందుకు యుపి కేబినెట్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ శనివారం ఆమోదం తెలిపారు. ఇప్పుడు అమలులోకి వచ్చిన చట్టం పరిధిలో యువకుడిపై తొలి కేసు దాఖలు అయిందనే విషయాన్ని అదనపు ప్రధాన కార్యదర్శి ( హోం) అవనీస్ అవస్థీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

షరీఫ్ నగర్ గ్రామస్థుడు టికారాం అనే వ్యక్తి ఇదే గ్రామానికి చెందిన అహ్మద్‌పై ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలిపారు. తన కూతురిని మత మార్పిడికి ప్రోత్సహిస్తూ వచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారని అధికారి వెల్లడించారు. కేసు నమోదు అయిన యువకుడిని అరెస్టు చేసేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ ఎస్‌పి రోహిత్ సింగ్ సజ్వాన్ తెలిపారు. టికారాం కూతురు, ఉవైష్ అహ్మద్ 12వ తరగతిలో కలిసి చదువుకున్నారని, ఈ దశలోనే యువకుడు తన కూతురిని మతమార్పిడికి బలవంతం చేశాడని, పలు విధాలుగా ప్రలోభపెట్టాడని ఈ ఫిర్యాదులో తెలిపారు.

మూడేళ్ల క్రితం ఈ వ్యక్తి తన కూతురును మతమార్పిడికి ఒప్పించేందుకు యత్నిస్తూ ఉండగా ఆమె నిరాకరించిందని, దీనితో కూతురును ఎత్తుకువెళ్లుతానని బెదిరించాడని టికారాం తన ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగారు. తన కూతురుకి ఈ ఏడాది జూన్‌లో వేరే వ్యక్తితో పెళ్లయిందని, అయినప్పటికీ అహ్మద్ తమ కుటుంబాన్ని వేధిస్తూ వస్తున్నాడని తెలియచేసుకున్నారు. ఓ దశలో అహ్మద్ తన కూతురి అత్తింటికి కూడా వెళ్లి ఆమెను పుట్టింటికి పంపించాలని బెదిరించి వచ్చినట్లు, దీనితో తన కూతురు బతుకు నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడినట్లు ఫిర్యాదీ తెలియచేసుకున్నారు. కేసు ఇప్పుడు దర్యాప్తు క్రమంలో ఉందని బరేలీ రేంజ్ డిఐజి రాజేష్ కుమార్ పాండే తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News