Thursday, May 2, 2024

భారత్‌లో ఓటు వేసిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సెలబ్రిటీలతో సహా ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి కోరడంతో ఓటింగ్ శాతం పెరుగుతోంది. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రపతి, ప్రధానమంత్రితో మొదలు పెడితే సామాన్యుడు వరకు ఓటు వేయాల్సిందే. ప్రముఖులు ఓటు వేయాలని ప్రచారం చేయడంతోనే పలు సందర్భాల్లో ఓటింగ్ శాతం పెరుగుతోంది. కొన్ని కొన్ని ప్రాంతాలలో ఓటింగ్ శాతం భారీగా రికార్డైన విషయాలను మనం చూస్తునే ఉన్నాం. దేశానికి 1947 స్వాతంత్య్రం వస్తే 1952లో ఎన్నికలు జరిగాయి. మొదటి ఓటు ఎవరు వేశారో మీకు తెలుసా?, శ్యామ్ శరణ్ నేగి అనే వ్యక్తి భారత్‌లో తొలి ఓటు వేశారు. 1917 జులై నెలలో శ్యామ్ శరణ్ నేగి జన్మించారు.

అతడు పదో తరగతి వరకు చదువుకొని 1940 నుంచి 46 వరకు అటవీ శాఖలో ఫారెస్ట్ గార్డుగా విధులు నిర్వహించారు. అక్కడి నుంచి విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా చేరాడు. బ్రిటీస్ పాలన ముగియడంతో 1952 ఫిబ్రవరిలో ఎన్నిలక నిర్వహించాలని భారత ప్రభుత్వం కోరుకుంది. కల్ప గిరిజన జిల్లాలో చలికాలంలో హిమపాతం ఎక్కువగా ఉండడంతో ముందే పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 1951 అక్టోబర్ 25న ఎన్నికలు నిర్వహించారు. శ్యామ్ శరణ్ నేగి ఎన్నికల డ్యూటీ పడడంతో పోలింగ్ స్థలానికి చేరుకొని 6.15 నిమిషాలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దీంతో స్వతంత్ర భారత దేశంలో ఆయన మొదటి ఓటరు అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News