Thursday, May 2, 2024

ఆయిల్ పామ్ పంటలపై దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్ (జి) : ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న ఆయిల్ పామ్ మొక్కలను సద్వినియోగం చేసుకొని, రైతులు ఆయిల్ పామ్ పంటలపై దృష్టి సారించాలని మండల క్లస్టర్ ఆఫీసర్ ఏ. క్రాంతి కుమార్ అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆట్ల పోతా రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 1.20 ఎకరాల్లో గురువారం ఆయిల్ పామ్ పంటను సాగు చేశారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ మొక్కలను పంపిణీ చేస్తోందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. ఇతర పంటలతో పాటు రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని అన్నారు. ఆయిల్ పామ్ మొక్కలు కావాల్సిన రైతులు ఏఈవోను సంప్రదించాలన్నారు. ఆయిల్ పామ్ మొక్కలు కావాల్సిన రైతులు పట్టా పాస్‌పుస్తకం, ఆధార కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌లతో పాటు 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతా రెడ్డి, నర్సాపూర్ జి. మండల క్లస్టర్ ఆఫీసర్ ఏ. క్రాంతి కుమార్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News