Tuesday, January 31, 2023

నాంపల్లి లో నాలుగు కార్లు దగ్ధం

- Advertisement -

హైదరాబాద్: నాలుగు కార్లు దగ్ధమైన సంఘటన నాంపల్లిలోని గగన్ విహర్ లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాంపల్లి ఎగ్జిబిషన్ వద్ద పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఒక కారులో మంటలు చెలరేగాయి.మంటలు ఎక్కువ కావడంతో పక్కనే ఉన్న మూడు కార్లకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు కార్లు పూర్తిగా కాలిపోయాయి.

ఈ ఘటనతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles