Monday, May 20, 2024

గని ప్రమాదంలో నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Four killed in SRP3 Mine accident

విషాదం అలుముకున్న సింగరేణి

మంచిరాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్‌ఆర్‌పి3 గనిలో ఘోర ప్రమాదం, రూఫ్ బోల్టింగ్ పనులు జరుగుతుండగా పైనుంచి కూలిన బండ
నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి
రాత్రి వరకు ఒక మృతదేహం వెలికితీత, ప్రమాదం పట్ల యాజమాన్యం తీవ్ర ద్రిగ్భాంతి
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : సంస్థ చైర్మన్

మనతెలంగాణ/మంచిర్యాల : జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలో గల ఎస్‌ఆర్‌పి3 గనిలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు అండర్‌గ్రౌండ్ గనిలో బేర లచ్చయ్య(60), కృష్ణారెడ్డి (58), గడ్డం సత్యనర్సింహరాజు(32), రెంక చంద్రశేఖర్(32)లు కలసి 21 డీప్, 24వ లెవల్ వద్ద రూప్ బోల్టింగ్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పై ను ంచి బండ కూలడంతో వారు నలుగురు అక్కడికక్కడే మృతి చెం దారు. ఈ సమాచారం అందుకున్న గని అధికారులు వెంటనే రెస్యూ టీం సభ్యులను పిలిపించి, మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నించారు.

కాగా రెంక చంద్రశేఖర్ మినహా ముగ్గురు మృతదేహాలు రాత్రి వరకు కూడా బయటకు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు, తోటికార్మికులు ఆందోళన చెందారు. రెంక చంద్రశేఖర్ మృతదేహాన్ని గని అండర్ గ్రౌండ్ నుంచి బయటకు తీసుకురావడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగానినాదాలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించారు. వీరికి జాతీయ కార్మిక సంఘాల నాయకులు సంఘీబావం ప్రకటించారు. బొ గ్గు ఉత్పత్తి పేరిట అధికారులు కార్మికులపై ఒత్తిడి పెంచి వా రి ప్రాణాలను బలిగొంటున్నారని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. మరి మూడు మృతదేహాలను బ యటకు తీసేందుకు రెస్కూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి

శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌ఆర్‌పి… -3, 3ఎ ఇంక్లైన్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వా రి కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన నలుగురు కార్మికుల కుటుంబాలకు సంస్థ ఛైర్మన్, ఎండి శ్రీధర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి తనకు నివేదించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదం అ త్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. మృతి చెందిన కు టుంబాలకు సంస్థఅండగా ఉంటుందని తెలియజేస్తూ మృతి చెందిన కార్మికులకు కంపెనీ తరపున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశించారు. కార్మికుని మృతి ఆ కుటుంబంలో తీవ్ర శోకం నింపుతుందని, వారి లేని లోటు కంపెనీ తీర్చలేకపోయినప్పటికీ తోటి సి ంగరేణి కుటుంబ సభ్యులుగా వారికి యాజమాన్యం అండగా ఉంటుందన్నారు.

ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటు ంబీకుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ఏరియా లో ఉద్యోగం కల్పించనున్నామని ప్రకటించారు. అలాగే గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు యాజమాన్యం తరపున చెల్లించే మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని సుమారు 70 లక్షల నుండి కోటి రూపాయల వర కు అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన సం బంధిత అధికారులకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటువంటి ప్రమాదాలు దురదృష్టకరమని, వీటిని నివారించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మృతుల కుటుంబీకుల కు కంపెనీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News