మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గురువారం ఉదయం లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మైనర్ బాలురు మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గడ్చిరోలిలోని హైవేలో తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వారు వివరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్న ఆరుగురు మైనర్లు కాట్లీ గ్రామంలో రోడ్డు పక్కన కూర్చుని ఉండగా లారీ వారిని ఢీకొంది. వారిలో నలుగురు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. ఇదిలావుండగా ఈ దుర్ఘటనకు తాను చాలా చింతిస్తున్నానని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అంతేకాక ఆయన తన సంతాపాన్ని వారి కుటుంబాలకు ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపారు. గడ్చిరోలిలోని జనరల్ హాస్పిటల్‌లో గాయపడిన ఇద్దరు బాలురు చికిత్స పొందుతున్నారని కూడా ఆయన తెలిపారు. ‘వారిని నాగ్‌పూర్‌కు హెలికాప్టర్ ద్వారా తరలించే ఏర్పాట్లు కూడా చేశాం’ అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందిస్తామని తెలిపారు.
లారీ ఢీకొని నలుగురు బాలురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -