Sunday, October 1, 2023

గానాబజానాలో ఫ్రాన్స్ దేశాధ్యక్షులు

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రాన్స్‌లో యువకుడి మరణం తీవ్రస్థాయి హింసాకాండకు, యువత అశాంతికి దారితీసిన దశలో దేశాధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పారిస్‌లోనే గానాబజానాల్లో మునిగి తేలారు. దేశం తగుబడుతూ ఉంటే అధ్యక్షులు ఈ విధంగా అల్లరిచిల్లరిగా వ్యవహరించడం ఏమిటని విమర్శలు తలెత్తాయి. పారిస్‌లో బ్రిటిష్ సింగర్ ఎల్టన్ జాన్ కన్సర్ట్ మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది. దీనికి మేక్రాన్ ఆయన భార్య ఉత్సాహంగా హాజరయ్యారు.

పాటలకు అనుగుణంగా ఆయన కొద్ది సేపు డాన్స్ కూడా చేశారని, సంబంధిత ఫోటోలు ఇంటర్నెట్‌లో వెల్లువెత్తాయని, మరి ప్రపంచవ్యాప్తంగా జనం ఫ్రాన్స్ గురించి, ఇక్కడి నేత గురించి ఏమనుకుంటారని పలువురు నెటిజన్లు స్పందించారు. యువతలో ఘర్షణలు తలెత్తుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న సమయంలోనే వీటి గురించి పట్టించుకోకుండా నేత ఈవిధంగా భార్యతో కలిసి మిత్రులతో చిందేసే విధంగా గడపడం ఎటువంటి సంకేతాలకు దారితీస్తుందని విమర్శలు హోరెత్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News