Saturday, September 21, 2024

రేపే ఫ్రెండ్ షిప్ డే!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన బంధువులను మనం ఎంపిక చేసుకోము. కానీ మన స్నేహితులను మనమే ఎంపిక చేసుకుంటాము. అలాంటి స్నేహితుల దినోత్సవం రేపు (4 ఆగస్టు 2024) ఉంది. మన స్నేహితులతో మనం మధురమైన క్షణాలు పంచుకుంటుంటాం. జీవితంలో మంచి స్నేహితులు ఉంటే జీవితం హాయిగా గడిచిపోతుంది. స్నేహితులతో మనం నవ్వుతాం, ఏడుస్తాం, పొట్లాడుతాం, ఆనంద క్షణాలను అనుభవిస్తాం. జీవితానికి ఒక్క బెస్ట్ ఫ్రెండ్ అయినా ఉండాలి. ఈ స్నేహితుల దినోత్సవం నాడు మీరు,  మీ మిత్రులకు మీ స్నేహం గురించి తెలుపండి.

2024 అంతర్జాతీయ స్నేహ దినోత్సవం థీమ్ ‘వైవిధ్యాన్ని స్వీకరించడం, ఏకత్వాన్ని పెంపొందిచడం’. జీవితంలో కష్టాలని, బాధలని, సుఖాలని సమానంగా పంచుకునేవాడు నిజమైన స్నేహితుడు. నేటి కాలంలో స్నేహంతో పేరుతో నటించేవాళ్లు, ముంచేవాళ్లు ఎక్కువ ఉన్నారు. అయినా మంచి స్నేహితులు కూడా ఉంటారు. నిజమైన స్నేహితులెవరో గుర్తించి వారితో మీ సంబంధాన్ని మరింత ధ్రువపరుచుకోండి.

మీ ఫ్రెండ్ కి విషెస్ పంపడం మరువకండి. మీకు నచ్చిన మంచి విషయాన్ని కోట్ చేయండి.

Friendship Day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News